ఎల్‌ఐసీ చైర్మన్‌గా ఎంఆర్ కుమార్

Thu,March 14, 2019 12:45 AM

MR Kumar appointed LIC Chairman

న్యూఢిల్లీ, మార్చి 13: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) నూత న చైర్మన్‌గా ఎంఆర్ కుమార్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. నార్త్-జోన్ జోనల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న కుమార్..ఎల్‌ఐసీ చైర్మన్‌గా ఐదేండ్లపాటు కొనసాగనున్నారు. ఈ విషయం సిబ్బంది నియామకాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే టీసీ సుశీల్ కుమార్, విపిన్ ఆనంద్‌లను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్లుగా నియమించింది. వీరు కూడా వచ్చే ఐదేండ్లపాటు తమ పదవుల్లో కొనసాగనున్నారు. సుశీల్ కుమార్..ఎల్‌ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తుండగా, వెస్ట్రన్ జోన్ జోనల్ మేనేజర్‌గా ఆనంద్ పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

311
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles