మరో మాంగళ్య షాపింగ్ మాల్

Tue,March 26, 2019 12:27 AM

MP Santhosh Kumar Launches Maangalya Shopping Mall At Boduppal

-హైదరాబాద్‌లో ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్

బోడుప్పల్, నమస్తే తెలంగాణ: వస్త్ర ప్రపంచంలో తమదైన గుర్తింపుతో వేగంగా విస్తరిస్తున్న మాంగళ్య.. హైదరాబాద్ నగరంలో మరో షాపింగ్ మాల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజధాని మార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన మాంగళ్య.. సోమవారం పీర్జాదిగూడ పురపాలక సంఘం పరిధిలో కొత్త షోరూంను ఆవిష్కరించింది. టీఆర్‌ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ షోరూంను అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం ఆయన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ కూడా విచ్చేయగా, ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పలు రకాల చీరలను చుట్టుకుని షోరూంలో సందడి చేశారు. కాగా, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ మాట్లాడుతూ..శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగర శివారు ప్రాంతాల్లో బోడుప్పల్, పీర్జాదిగూడ పురపాలికలు ముందున్నాయన్నారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్‌ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాంగళ్య వ్యవస్థాపకుడు పీఎన్ మూర్తి, చైర్మన్ నమశ్శివాయ, డైరెక్టర్లు కేశం శివ ప్రసాద్, పీ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

1063
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles