దిగొచ్చిన పసిడి ధర

Wed,July 10, 2019 04:18 AM

more reduces thulambulius gold price

-ఒకేరోజు రూ.600 తగ్గిన తులంబులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,400
న్యూఢిల్లీ, జూలై 9: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు మళ్లీ దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా తగ్గడంతోపాటు దేశీయంగా ఆభరణాల వర్తకులు కొనుగోళ్ళకు మొగ్గుచూపకపోవడంతో 99.9 శాతం స్వచ్ఛ త కలిగిన పదిగ్రాముల బంగారం ధర ఒకేరోజు రూ.600 తగ్గి రూ.34,870కి పరిమితమైంది. కిలో వెండి ధర రూ.40 తగ్గి రూ.38,900 వద్ద ముగిసింది. న్యూయార్క్ దిగొచ్చిన పసిడి ధర4.39 డాలర్లకు పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ధరలు శాంతించాయి. మరోవైపు ఔన్స్ వెండి కూడా 15.08 డాలర్లకు చేరుకున్నది. రూపాయితో పోలిస్తే డాలర్ విలువ మూడు వారాల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో పసిడి దిగువముఖం పట్టిందని, భవిష్యత్తులో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు కూడా ఉండటం పరోక్షంగా దోహదం చేశాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ హరీష్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సార్వత్రిక బడ్జెట్లో దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయంలో ఒక్కసారిగా బంగారం భగ్గుమన్నది.

6964
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles