మైన్‌మ్యాక్స్‌ను ఆవిష్కరించిన సియెట్

Wed,January 9, 2019 12:14 AM

minemax invented the CEAT

హైదరాబాద్, జనవరి 8: ప్రత్యేక టైర్ల తయారీ సంస్థ సియెట్..టిప్పర్ ట్రక్కులకు సరిగ్గా సరిపోయే మైన్‌మ్యాక్స్ టైర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. టైర్ బ్రేకర్ ైప్లె టెక్నాలజీతో రూపొందించిన ఈ టైర్లు ఎక్కువకాలం మన్నిక కలిగివుంటాయి. క్లిష్టమైన రహదారులపై సులువుగా వెళ్లడంతోపాటు.. పంక్చర్ రెసిస్టెన్స్ వీటి విశిష్టత. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ విజయ్ గంభీరే మాట్లాడుతూ..రామగుండం ప్రాంతంలో భారీ ట్రక్కుల వినియోగాన్ని దృష్టిలోపెట్టుకొని ఈ టైర్లను ఇక్కడ విడుదల చేసినట్లు చెప్పారు. ఇప్పటికే ఈ టైర్లను భారత్‌లో గనులు అధికంగా ఉండే బెంగాల్, జార్ఖండ్, ఒడిశాలలో పరీక్షించి చూసినట్లు తెలిపారు.

418
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles