వలస వెళ్తున్న మిలియనీర్లు

Mon,May 13, 2019 12:10 AM

Millionaires fleeing India in larger numbers

-విదేశాలకు క్యూ కడుతున్నభారతీయ సంపన్నులు
-తాజా అంతర్జాతీయ సమీక్షలో వెల్లడి

న్యూఢిల్లీ, మే 12: భారతీయ సంపన్నులు వలస బాట పడుతున్నారు. పరాయి దేశానికి పరుగులు తీస్తున్నారు. గతేడాది దేశం విడిచి వెళ్లిపోయిన మిలియనీర్ల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నది మరి. సులభతర వ్యాపార నిర్వహణ సూచీలో మెరుగయ్యామని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనదే అని ఓ వైపు కేంద్రం ప్రకటనలు చేస్తుంటే.. మరోవైపు మిలియనీర్ల పోక అయోమయానికి గురిచేస్తున్నది. ఏఎఫ్‌ఆర్‌ఏషియా బ్యాంక్, రిసెర్చ్ సంస్థ న్యూ వరల్డ్ వెల్త్ సంయుక్తంగా 2019 గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ చేపట్టాయి. నిరుడు దాదాపు 5,000 మంది మిలియనీర్లు లేదా అపర కుబేరులు దేశం విడిచి వెళ్లార ని తేలింది. దేశంలోని మొత్తం అపర కుబేరుల్లో ఇది 2 శాతానికి సమానం కావడం గమనార్హం. ముఖ్యంగా బ్రెగ్జిట్‌తో అట్టుడికిపోతున్న బ్రిటన్ కంటే కూడా మిలియనీర్ల వలసల్లో భారత్ ముం దుండటం ఆందోళన కలిగిస్తున్నది. కాగా, అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనా మి లియనీర్లు అధికంగా వలసపోతున్నట్లు స్పష్టమైంది. ఈ క్రమంలోనే చైనా మొదటి స్థానం లో ఉండగా, రష్యా రెండో స్థానంలో నిలిచింది. స్వదేశాలను వీడుతున్న మిలియనీర్లు.. ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియా ల్లో స్థిరపడుతున్నట్లు తాజా సమీక్ష తే ల్చింది.

సంపద సృష్టిలో హైదరాబాద్ కీలకం

రాబోయే తొమ్మిదేండ్లలో దేశంలో సంపద బాగా పెరుగుతుందని, బ్రిటన్, జర్మనీలను వెనుకకు నెట్టి 2028కల్లా నాలుగో అతిపెద్ద వెల్త్ మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించనుందని ఈ సందర్భంగా ఏఎఫ్‌ఆర్‌ఏషియా బ్యాంక్, న్యూ వరల్డ్ వెల్త్ పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే దేశ సంపద సృష్టిలో హైదరాబాద్ కీలకంగా మారుతుందని స్పష్టం చేశాయి. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, బెంగళూరుల్లోనూ సంపద పెరుగుతుందని చెప్పాయి. హైదరాబాద్.. ఔషధ రంగానికి దేశ రాజధానిగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్‌ఈజెడ్)కు కొదవే లేదని, ఇవి సంపద సృష్టికి దోహదపడుతాయని వివరించాయి.

997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles