ఇక మైక్రోమాక్స్ మైక్రోవేవ్స్


Tue,October 17, 2017 12:38 AM

-మరో మూడు సెగ్మెంట్లలోకి సంస్థ.. మూడేండ్లలో 300 కోట్ల పెట్టుబడి
-కంపెనీ సహ-వ్యవస్థాపకుడు రాజేశ్ అగర్వాల్ వెల్లడి
Micromax
న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో అగ్రగామి దేశీయ సంస్థ మైక్రోమాక్స్..నూతన సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. ఇప్పటికే టీవీలు, మొబైల్ హ్యాండ్ సెట్లను తయారు చేస్తున్న సంస్థ..తాజాగా వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్స్ రంగంలోకి అడుగు పెట్టింది. దీంతో పూర్తిస్థాయి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థగా అవతరించినట్లు అయింది. ఇందుకోసం వచ్చే రెండు నుంచి మూడేండ్లకాలంలో రూ.300 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు మైక్రోమాక్స్ సహ-వ్యవస్థాపకుడు రాజేశ్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టీవీ ప్యానెల్ మార్కెట్లో 7 శాతం నుంచి 8 శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. గతేడాది ఏసీ సెగ్మెంట్‌లోకి అడుగు పెట్టిన సంస్థ..వచ్చే సీజన్‌లో ఈ విభాగంలో మరిన్ని నూతన ప్రొడక్టులను విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో 20-25 శాతం మధ్యలో వాటా కలిగివుండగా, వచ్చే మూడేండ్లకాలంలో ఈ వాటాను 40 శాతానికి పెంచుకోవాలనుకుంటున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్‌తోపాటు బీవాడి(రాజస్థాన్), రుద్రపూర్(ఉత్తరాఖండ్)లలో ఉత్పత్తి కేంద్రాలున్నాయి. వచ్చే మూడేండ్లలో ఈ ప్లాంట్ల సామర్థ్యాన్ని మరింత పెంచడానికి రూ.200-300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

281
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS