లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎంఈఐఎల్

Mon,March 11, 2019 11:43 PM

MEIL in Limca records for fastest execution of sub station

-తక్కువ సమయంలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశంలోనే అతి తక్కువ సమయంలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని పూర్తిచేసిన మెగా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ (ఎంఈఐఎల్) లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించింది. కేవలం ఏడు నెలల వ్యవధిలోనే 400/200 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని పూర్తిచేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా నంబూలపూలకుంట పరిధిలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్న ఆల్ట్రా మెగా సోలార్ పార్క్ గ్రిడ్‌కు 400/200 కేవీ సబ్‌స్టేషన్‌ను అనుసంధానించాలనేది లక్ష్యం. ఈ నేపథ్యంలో నంబూలపూలకుంట వద్ద ఈ సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని సవాలుగా స్వీకరించిన మెగా కంపెనీ..2015 సెప్టెంబరు 25న నిర్మాణ పనులను మొదలుపెట్టి.. గడువు కన్నా ముందుగానే 2016 ఏప్రిల్ 26 నాటికి పూర్తి చేసి రికార్డు నెలకొల్పింది. సాధారణంగా ఇలాంటి సబ్‌స్టేషన్ నిర్మాణానికి 15-18 నెలల సమయం పడుతుంది కానీ, దీనిని ఏడునెలల వ్యవధిలోనే పూర్తిచేయడం విశేషమని కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇందుకుగాను పవర్ గ్రిడ్ కార్పొరేషన్ బెస్ట్ డెబ్యూటంట్ అవార్డుతోనూ సత్కరించింది. దీంతోపాటు ఏషియా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు దక్కిందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

384
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles