యూపీలో మేఘా భారీ విద్యుత్ ప్రాజెక్టు


Tue,February 13, 2018 12:42 AM

Sub-Station
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశీయ ప్రైవేట్ రంగంలో తొలిసారిగా అతిపెద్ద విద్యుత్ సరఫరా వ్యవస్థను నిర్మించింది హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్. 13,220 ఎంవీఏ విద్యుత్ సరఫరా సామర్థ్యం ఉన్న ఈ పవర్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ ఇటీవలే జాతికి అంకితమైంది. ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతంలో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చేపట్టిన వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ లిమిటెడ్ (డబ్ల్యూయూపీపీటీసీఎల్)ను ఎంఈఐఎల్ (మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్) పూర్తి చేసింది.

దీంతో హైదరాబాద్ కేంద్రంగా దేశ, విదేశాల్లో కార్యకలాపాలను కొనసాగిస్తున్న ఈ సంస్థ.. తాగు, సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల నిర్మాణాల్లోనే కాకుండా విద్యుత్ సరఫరా రంగంలోనూ కీలక మైలురాయిని దాటినట్లయింది. ఈ ప్రాజెక్టుతో యూపీలోని పది జిల్లాల్లో విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తుండగా, ఏడు సబ్ స్టేషన్లతోపాటు 836 సర్యూట్ కిలోమీటర్ల పొడవైన విద్యుత్ లైన్లను మేఘా ఇంజినీరింగ్ నిర్మించింది. 2011 మే 31న ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించిన మేఘా.. ఈ నెలలో లక్ష్యం మేరకు పూర్తి చేయడం విశేషం. కాగా, దేశంలోనే తొలిసారిగా గ్యాస్ ఆధారిత జీఐఎస్ (గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్లు) నిర్మించిన ఘనత ఈ ప్రాజెక్టుతో మేఘా ఇంజినీరింగ్‌కు దక్కింది. జీఐఎస్‌లో సాధారణం కన్నా 65 శాతం తక్కువ ప్రాంతంలోనే ఇండోర్ పద్ధతిలో ప్రాజెక్టును నిర్మిస్తారు.

371
Tags

More News

VIRAL NEWS