చుట్టుముట్టిన భయాలు

Tue,March 26, 2019 12:32 AM

Massive sales in banking and Realty sectors

-38 వేల పాయింట్ల దిగువకు సెన్సెక్స్
-బ్యాంకింగ్, రియల్టీ రంగాల్లో భారీ అమ్మకాలు

ముంబై, మార్చి 25: మళ్లీ బేర్ పంజావిసిరింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలతో దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాలు పోటెత్తాయి. వరుసగా రెండోరోజు బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ భారీగా నష్టపోవడంతో 38 వేల దిగువకు పడిపోయింది. బ్యాంకింగ్, రియల్టీ రంగానికి చెందిన షేర్లను మదుపరులు విక్రయించడంతో ఈ పతనానికి ఆజ్యం పోసినట్లు అయింది. గ్లోబల్ భయాలకు తోడు దేశీయ మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఒక దశలో 400 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 355.70 పాయింట్ల నష్టంతో 37,808.91 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ మరో 102.65 పాయింట్లు పతనం చెంది 11,354.25 వద్ద స్థిరపడింది. గడిచిన రెండు సెషన్లలో సెన్సెక్స్ 575 పాయింట్లు కోల్పోయినట్లు అయింది. అమెరికా, యూరప్ దేశాల ఆర్థిక వృద్ధి నిరాశాజనకంగా ఉండటం మార్కెట్లను మరింత కుదుపునకు గురిచేయగా, అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం ఈ ఆందోళనలను మరింత పెంచిందని మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిరేటు మరింత పడిపోయే ప్రమాదం ఉందన్న భయాలు స్టాక్ మార్కెట్లకు చుట్టుముట్టాయని జియోజిట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.

నేటి మార్కెట్లో వేదాంత లిమిటెడ్ అత్యధికంగా 3.28 శాతం పడిపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. టాటా మోటార్స్ 2.31 శాతం, యెస్ బ్యాంక్ 2.18 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.11 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.07 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 1.95 శాతం, కొటక్ బ్యాంక్ 1.92 శాతం, సన్‌ఫార్మా 1.91 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.78 శాతం, ఎస్‌బీఐ 1.44 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.26 శాతం, ఎల్ అండ్ టీ 1.21 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 1.09 శాతం పతనం చెందాయి. వీటితోపాటు హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, హీరో మోటోకార్ప్, ఇండస్‌ఇంద్ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీసీ లిమిటెడ్, మారుతి సుజుకీ, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, బజాజ్ ఆటోలు కూడా ఒక శాతం వరకు మార్కెట్ వాటాను కోల్పోయాయి. మరోవైపు ఓఎన్‌జీసీ 3.90 శాతం, కోల్ ఇండియా 2.09 శాతం, పవర్‌గ్రిడ్ 1.56 శాతం, ఎన్‌టీపీసీ 1.19 శాతం, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే రియల్టీ రంగ షేర్లు అత్యధికంగా 1.83 శాతం పతనం చెందగా, మెటల్ 1.30 శాతం, బ్యాంకెక్స్ 1.29 శాతం, టెక్ 1.12 శాతం, ఆటో 1.10 శాతం, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగ షేర్లను మదుపరులు విక్రయించారు. కానీ, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ, ఇన్‌ఫ్రా, ఇంధన రంగ షేర్లను మదుపరులు ఆకట్టుకున్నాయి.

గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి..

అంతర్జాతీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. గ్లోబల్ వృద్ధిరేటుపై నీలినీడలు కమ్ముకుంటుండటంతో ఆసియా మార్కెట్లతోపాటు యూరప్ సూచీలపై ప్రభావం పడింది. దీంతో జపాన్ నిక్కీ ఏకంగా 3.01 శాతం పతనం చెందగా, హాంకాంగ్ సూచీ 2.15 శాతం, షాంఘై కంపొజిట్ ఇండెక్స్ 1.97 శాతం, సింగపూర్ సూచీ 1.27 శాతం, కొరియా 1.92 శాతం, తైవాన్ 1.50 శాతం వరకు నష్టపోయాయి. ప్రారంభంలో భారీగా నష్టపోయిన యూరోపియన్ దేశాల స్టాక్ మార్కెట్లు ముగిసే వరకు ఇదే తీరుగా ట్రేడయ్యాయి.

937
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles