మారుతి కార్లు మరింత ప్రియం

Thu,December 6, 2018 12:57 AM

Maruti Suzuki to hike car prices from 1 January 2019

న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ కూడా ధరలు పెంచడానికి సిద్ధమవుతున్నది. కమోడిటీ ఉత్పత్తులు పెరుగుతుండటం, విదేశీ మారకం రేట్లలో ఉన్న మార్పుల కారణంగా ఉత్పత్తి వ్యయం అధికమవుతుందని, దీంతో వచ్చే నెల నుంచి అన్ని రకాల వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంతమొత్తంలో ధరలను పెంచుతున్న విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. ప్రస్తుతం ఏ స్థాయిలో పెంచేదానిపై చర్చలు జరుగుతున్నాయని బీఎస్‌ఈకి కంపెనీ సమాచారం అందించింది. సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని వినియోగదారులకు మళ్లించే ఉద్దేశంలో భాగంగా ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాల వెల్లడించాయి.

905
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles