పీవీ విక్రయాల్లో సుజుకీ హవా

Thu,September 20, 2018 12:21 AM

Maruti Suzuki dominates top 10 best selling PV list in August 2018

-టాప్-10లో ఆరు మారుతి కార్లే
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ హవా కొనసాగుతున్నది. గడిచిన నెలలో దేశవ్యాప్తంగా అమ్ముడైన ప్యాసింజర్ వాహనాల టాప్-10 జాబితాలో తొలి ఆరు మారుతియే కావడం విశేషం. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) విడుదల చేసిన నివేదికలో మారుతికి చెందిన ఆల్టో 22,237 యూనిట్లతో తన తొలిస్థానాన్ని పదిలం చేసుకున్నది. క్రితం ఏడాది ఇదే నెలలో 21,521 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏడాదికిత్రం తొలి స్థానంలో ఉన్న మారుతి డిజైర్ ఈసారి 21,990 యూనిట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నది. మూడో స్ధానంలో స్విఫ్ట్(19,115 యూనిట్లు), ఆ తర్వాతి స్థానంలో 17,713 యూనిట్లతో బాలెనో ఉండగా, 13,658 యూనిట్ల విక్రయాలు జరిపి వ్యాగన్ ఆర్‌కు ఐదో స్థానం దక్కింది. 2017 ఆగస్టులో నాలుగోస్థానంలో ఉన్న మారుతి విటారా బ్రెజా ఈ సారి రెండు స్థానాలు పడిపోయి ఆరు స్థానంతో సరిపెట్టుకున్నది. ఇందుకుగాను 13,271 యూనిట్ల విక్రయాలు జరిపింది. హ్యుందాయ్‌కి చెందిన హ్యాచ్‌బ్యాక్ గ్రాండ్ ఐ10 ఈ జాబితాలో ఏడో స్థానం దక్కించుకున్నది. 11,489 యూనిట్లు అమ్ముడయ్యాయి. కంపెనీకి చెందిన మరో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20కి 11,475 యూనిట్లతో ఆ తర్వాతి స్థానం లభించగా, 10,394 యూనిట్లను విక్రయించిన క్రెటాకు తొమ్మిదో స్థానం దక్కింది. చివరి స్థానంలో హోండా కాంప్యాక్ట్ సెడాన్ అమేజ్‌కు లభించింది.

587
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles