మారుతి ప్రొడక్షన్ కట్

Thu,October 10, 2019 01:54 AM

వరుసగా ఎనిమిదో నెల తగ్గించిన సంస్థ
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఆటోమొబైల్ రంగంలో మందకొడి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రస్తుత పండుగ సీజన్‌పై గంపెడు ఆశ పెట్టుకున్న సంస్థలకు నిరాశే ఎదురైంది. దీంతో చేసేదేమి లేకపోవడంతో ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. కార్ల తయారీ దిగ్గజం మారుతి కూడా వరుసగా ఎనిమిది నెలలో సెప్టెంబర్‌లోనూ తన ఉత్పత్తిని 17.48 శాతం తగ్గించుకుఉన్నది. గత నెలలో సంస్థ కేవలం 1,32,199 యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఏడాది క్రితం ఇదే నెలలో 1,60,219 కార్లను ప్రొడ్యుస్ చేసినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. వీటిలో ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి 1,57,659 యూనిట్ల నుంచి 1,30,264 యూనిట్లకు పడిపోవడంతో కంపెనీ ఉత్పత్తిపై భారీ దెబ్బతీసింది. మినీ, కాంప్యాక్ట్ సెగ్మెంట్ కాైర్లెన ఆల్టో, న్యూ వ్యాగన్ ఆర్, సెలేరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్‌ల ఉత్పత్తి 1,15,576 ల నుంచి 98,337లకు తగ్గించింది. వీటితోపాటు విటారా బ్రెజ్జా, ఎర్టిగా, ఎస్-క్రాస్ మోడళ్ల ఉత్పత్తి కూడా 17.05 శాతం తగ్గించుకున్న సంస్థ..మధ్యస్థాయి సెడాన్ సియాజ్‌ను 2,350 యూనిట్లు ప్రొడ్యుస్ చేయగా, లైట్ కమర్షియల్ వాహనమైన సూపర్ కెర్రీలను కూడా తగ్గించుకున్నది. కాగా, మరో సంస్థ టాటా మోటర్స్ కూ డా 63 శాతం ఉత్పత్తిని తగ్గించుకున్నట్లు ఇదివరకే ప్రకటించింది. గత నెలలో మారుతి, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్, టయోటా, హోండా విక్రయాలు రెండంకెల స్థాయిలో పడిపోయాయి.


393
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles