సెలేరియో రికార్డు

Sat,April 13, 2019 02:19 AM

Maruti Suzuki Celerio records annual sales of over 1 lakh units

-గతేడాది లక్ష యూనిట్ల విక్రయం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: కార్ల దిగ్గజం మారుతికి చెందిన కాంప్యాక్ట్ కారు సెలేరియో మరో రికార్డును సొంతం చేసుకున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 1,03,734 యూనిట్ల విక్రయాలు జరిపినట్లు సంస్థ ఒక ప్రకటనలలో వెల్లడించింది. ఒక ఏడాదిలో లక్షకు పైగా అమ్మకాలు జరిపిన విభాగంలోకి సెలేరియో కూడా చేరింది. 2014లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కారు ఇప్పటి వరకు 4.7 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో కూడా 10 శాతం వృద్ధితో ఈ రికార్డును సొంతం చేసుకున్నదని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(మార్కేటింగ్) ఆర్‌ఎస్ కల్సీ తెలిపారు. పెట్రోల్ ఇంజిన్‌తో తయారైన సెలేరియో మోడల్ 23.1 కిలోమీటర్ల మైలేజి ఇవ్వనున్నది. సీఎన్‌జీ కలిగిన మోడల్ మాత్రం 31.76 కిలోమీటర్ల ఇవ్వనున్నదని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

801
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles