మారుతి ఉత్పత్తిలో కోత

Mon,November 11, 2019 03:30 AM

న్యూఢిల్లీ, నవంబర్‌ 10: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి ఉత్పత్తిని భారీగా తగ్గించుకున్నది. అక్టోబర్‌ నెలలోనూ 20.7 శాతం తగ్గించుకున్నది. వరుసగా ఇలా తగ్గించుకోవడం ఇది తొమ్మిదోసారి. గత నెలలో 1,19,337 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే నెలలో చేసిన 1,50,497లతో పోలిస్తే 20 శాతానికి పైగా తగ్గిందని సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. వీటిలో ప్యాసింజర్‌ వాహనాల ఉత్పత్తి 1,48,318ల నుంచి 1,17,383లకు పడిపోయాయి. కంపెనీకి చెందిన మినీ, కాంప్యాక్ట్‌ సెగ్మెంట్‌ కాైర్లెన ఆల్టో, న్యూ వ్యాగన్‌ ఆర్‌, సెలేరియో, ఇగ్నిస్‌, స్విఫ్ట్‌ల ఉత్పత్తి 85 వేలకు తగ్గించిన సంస్థ.. బాలెనో, డిజైర్‌, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, ఎస్‌-క్రాస్‌ మోడళ్ల ఉత్పత్తిని స్వల్పంగా పెంచుకున్నది.

135
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles