మెప్పించని రాబడులు

Sat,January 12, 2019 12:08 AM

Markets open flat Sensex up 27 points Nifty below 10 800

- లాభాల స్వీకరణకే ఇన్వెస్టర్ల మొగ్గు
- నిఫ్టీకి 27 పాయింట్ల నష్టం

టీసీఎస్, టాటామోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ తదితర హెవీవెయిట్ షేర్ల నష్టాలతో ప్రధాన సూచీలు వరుసగా రెండో రోజు కూడా నష్టాలతో ముగిశాయి. గరిష్ఠ స్థాయిల్లో ప్రారంభం అయినప్పటికీ మూమెంటమ్ నిలదొక్కుకోలేకపోయింది. మూడో త్రైమాసిక రాబడుల్లో ఆశించిన వృద్ధి కనిపించకపోవడంతో లాభాల స్వీకరణకే ఇన్వెస్టర్లు మొగ్గుచూపారు. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతుండడం, రూపాయి మారకం విలువ క్షీణిస్తూ ఉండడంతో మార్కెట్లో అప్రమత్త ధోరణి కనిపించింది. చివరి గంటలో వచ్చిన రికవరీతో సూచీలు స్వల్ప నష్టాలకే పరిమితం అయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 96.66 పాయింట్ల నష్టంతో 36,009.84 వద్ద ముగియగా, నిఫ్టీ 26.65 పాయింట్ల నష్టంతో 10,794.95 వద్ద ముగిసింది. క్రూడాయిల్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక శాతం పెరిగింది. అతి పెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ను మెప్పించలేకపోయాయి. మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడిన ఇన్ఫోసిస్ ఫలితాలు కూడా నిరాశాజనకంగా ఉండడంతో ఈ సీజన్‌లో ఆర్థిక ఫలితాలపై ఆశలు అడుగంటిపోతున్నాయి.

ఆర్థికసేవలు, ఎఫ్‌ఎంసీజీ రంగాల ఇండెక్స్‌లు మినహా మిగతా అన్నిరంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. రియల్టీ ఇండెక్స్ గరిష్ఠంగా 1.35 శాతం మేర నష్టపోయింది. ఆటో ఇండెక్స్ 0.79 శాతం, బ్యాంక్ నిఫ్టీ 0.27 శాతం, ఐటీ 0.11 శాతం చొప్పున నష్టపోయాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు సగటున పావుశాతం చొప్పున నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.61 శాతం, ఆర్థిక సేవలరంగ 0.13 శాతం చొప్పున లాభపడ్డయి. ఎన్‌ఎస్‌ఈలో మార్కెట్ బ్రెడ్త్ నెగటివ్‌గా ఉంది. ఎన్‌ఎస్‌ఈలో మొత్త 1,015 షేర్లు నష్టపోగా, 736 షేర్లు లాభాలతో ముగిశాయి. నిఫ్టీలోనూ 34 షేర్లు నష్టపోగా, 16 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఐటీసీ 1.76 శాతం, యూపీఎల్ 1.1 శాతం, విప్రో 1.07 శాతం, ఐఓసీ 0.89 శాతం చొప్పున లాభపడ్డాయి. కాగా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 3.45 శాతం, టాటామోటార్స్ 3.20 శాతం, ఇన్‌ఫ్రాటెల్ 2.96 శాతం, టీసీఎస్ 2.39 శాతం చొప్పున నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో 8 షేర్లు కొత్త 52 వారాల గరిష్ఠస్థాయిని నమోదు చేయగా, 45 షేర్లు కొత్త 52 వారాల కనీస స్థాయిని నమోదు చేశాయి. ఎఫ్‌ఐఐలు రూ. 687.2 కోట్ల అమ్మకాలు జరపగా, డీఐఐలు రూ. 123.17 కోట్ల కొనుగోళ్లు జరిపారు.

421
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles