HomeBusiness News

స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు

Published: Tue,August 20, 2019 02:15 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

ముంబై, ఆగస్టు 19: ప్రారంభంలో భారీగా లాభపడిన స్టాక్ మార్కెట్లు చివరి గంటలో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 52.16 పాయింట్లు లాభపడి 37,402.49 వద్ద ముగియగా, నిఫ్టీ 6.10 పాయింట్ల లాభంతో 11,053.90 వద్ద స్థిరపడింది. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తంకావడంతో ఫైనాన్షియల్, ఆటో రంగ షేర్లు అమ్మకాలకు గురవడంతో భారీ లాభాలకు బ్రేక్‌పడినట్లు అయింది. ఇంట్రాడేలో 369 పాయింట్లు లాభపడిన సూచీ చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నది. గడిచిన మూడు సెషన్లలో సెన్సెక్స్ 444.33 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 128.05 పాయింట్లు చొప్పన పెరిగాయి.

సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు మూడు శాతం వరకు లాభపడగా, మరోవైపు యెస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఓఎన్‌జీసీ, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు 3.46 శాతం వరకు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే కన్జ్యూమర్ డ్యూరబుల్, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రీయల్, హెల్త్‌కేర్, ఇంధనం, ఐటీ రంగ షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించింది. కానీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో, మెటల్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు మాత్రం నష్టపోయాయి. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యంత విలువైన కంపెనీగా మళ్లీ అవతరించింది. కంపెనీ షేరు ధర భారీగా లాభపడటంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 8,19,073.62 కోట్లకు చేరుకున్నది. తన సమీప ప్రత్యర్థి టీసీఎస్ విలువ రూ.8,11, 847.19 కోట్ల కంటే రూ.7,226.43 కోట్ల అధిక విలువ కలిగివున్నది.

220

Recent News