మున్ముందు వృద్ధి మరింత కిందికి!

Tue,September 19, 2017 12:48 AM

Manmohan Singh says demonetisation adversely affected India s GDP growth

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హెచ్చరిక
Manmohan
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: జీఎస్టీ అమలులో ప్రభుత్వం తొందరపాటుతోపాటు పెద్దనోట్ల రద్దు ప్రభావంతో మున్ముందు త్రైమాసికాల్లో వృద్ధి మరింత పతనం కావచ్చని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హెచ్చరించారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ వృద్ధిరేటు 2 శాతం మేర క్షీణించవచ్చని గతేడాది నవంబర్‌లో మన్మోహన్ సింగ్ అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే జీడీపీ తగ్గుతూ వచ్చింది. ఏప్రిల్-జూన్ మధ్యకాలానికి 5.7 శాతానికి పతనమైంది. గత ఏడాది ఇదేకాలానికి వృద్ధి 7.9 శాతంగా ఉంది. డిమానిటైజేషన్‌తోపాటు జీఎస్టీ అమలు కూడా అసంఘటిత, చిన్న తరహా పరిశ్రమల రంగాలపై ప్రభావం చూపనున్నాయి. వృద్ధి పతనం అవుతుండటానికి ఈ నిర్ణయాలే కారణం. దేశంలోని 90 శాతం ఉద్యోగులు అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. మున్ముందు వృద్ధి మరింత తగ్గవచ్చు అని సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మన్మోహన్ పేర్కొన్నారు.

139

More News

VIRAL NEWS

Featured Articles