అమ్మకానికి మలేషియా ఎయిర్‌లైన్స్!

Wed,March 13, 2019 01:37 AM

Malaysian Airlines For Sale!

కౌలాలంపూర్, మార్చి 12: డ్బ్బై ఏండ్ల చరిత్ర కలిగిన ప్రముఖ విమానయాన సంస్థ మలేషియా ఎయిర్‌లైన్స్ ఇక కనుమరుగుకాబోతున్నాదా! అవుననే అంటున్నాయి అక్కడి ప్రభు త్వ వర్గాలు. గడిచిన నాలుగేండ్లలో రెండు విమానాలను కోల్పోవడంతో సంస్థ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నది. 2014లో అదృశ్యమైన ఎంహెచ్370 ఇప్పటి వరకు జాడలేకపోవడం, ఎంహెచ్17 ను రష్యా క్షిపణిల దాడిలో ధ్వంసం కావడం తో నష్టాలు అంతకంతకు పెరిగాయి. దీంతో పలు ప్రభుత్వరంగ సంస్థలను నిర్వహిస్తున్న ఖజానా దీనిని కొనుగోలు చేసింది. అయిన ప్పటికీ ఆర్థికంగా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు రాలేదు. సంస్థ దివాలా తీయడం, కీలక సంస్కరణలు తీసుకురావడం, వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపినప్పటికీ పరిస్థితి అలాగే కొనసాగింది. గడిచిన కొన్ని నెలలుగా సంస్థ పనితీరు నిరాశావాదంగా ఉండటం, ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉన్నదని గతవారంలో ఖజానా విడుదల చేసిన ఆర్థిక ఫలితాల్లో వెల్లడించింది. దీనిపై ఆ దేశ ప్రధాని మహథిర్ మహ్మద్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ..ఇది చాలా కఠిన విషయమని, జాతీయ ఎయిర్‌లైన్స్‌ను అమ్మనన్న అమ్ము తాం .. మొత్తానికి మూసివేస్తాం అని ప్రకటించారు. సంస్థను మూసివేయడం, విక్రయించేదానిపై ఏది ఆమోదయోగ్యమో అనేదానిపై ఒక బృందంతో దర్యాప్తు చేసి ఆ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. ఖజానా గడిచిన సంవత్సరానికిగాను 1.54 బిలియన్ డాలర్ల నష్టాన్ని ప్రకటించింది.

771
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles