హైదరాబాద్‌లో మలేషియన్ కంపెనీ టీడబ్ల్యూటీ

Thu,October 11, 2018 11:38 PM

Malaysia based TWT forays in hyderabad

మార్కెట్లోకి రెండు హెల్త్‌కేర్ ఉత్పత్తులు
హైదరాబాద్, అక్టోబర్ 11: పరిశుభ్రత, హెల్త్‌కేర్ రంగంలో నిమగ్నమైన మలేషియాకు చెందిన టైటానియం వరల్డ్ టెక్నాలజీ హైదరాబాద్‌లో కార్యాకలాపాలను ప్రారంభించింది. నూరు శాతం అనుబంధ సంస్థ స్మార్ట్‌కోట్ ఇండియా పేరుతో కార్యకలాపాలను ప్రారంభించిన కంపెనీ దేశీయ మార్కెట్‌లో రెండు యాంటీ బాక్టీరియల్ ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. పరిశ్రమల్లో వినియోగించేందుకు స్మార్ట్ కోట్ అనే ఉత్పత్తిని ప్రవేశపెట్టగా, వ్యక్తిగత పరిశుభ్రత కోసం అర్మర్ 8 అనే ఉత్పత్తిని ప్రవేశపెట్టింది. కేవలం కొన్ని నిమిషాల్లోనే బాక్టీరియా, వైరస్‌లను తొలగించే ఈ ఉత్పత్తులు కొన్ని నెలల పాటు మళ్లీ బాక్టీరియా, వైరస్‌లు సోకకుండా చేస్తాయని స్మార్ట్‌కోట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కడియం రామకృష్ణ తెలిపారు. టిటానియం వరల్డ్ టెక్నాలజీ టెక్నికల్ డైరక్టర్ ఉత్పత్తుల విశిష్టతను తెలిపారు. ప్రస్తుతానికి మలేషియాలోనే ఉత్పత్తి చేస్తున్నట్టు దేశీయంగా డిమాండ్‌ను బట్టి తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ప్రస్తుతం 45 మంది డిస్టిబ్యూటర్లో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో విక్రయాలు ప్రారంభించామనీ, త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్టు రామకృష్ణ తెలిపారు.

288
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles