మార్కెట్లోకి నూతన స్కార్పియో

Wed,November 15, 2017 12:14 AM

Mahindra Scorpio Facelift Launched In India Price Starts At 9 97 Lakh

ధర రూ.9.97 లక్షలు
scorpio
న్యూఢిల్లీ, నవంబర్ 14: కమర్షియల్ వాహన తయారీలో అగ్రగామి సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ..దేశీయ మార్కెట్లోకి ఎస్‌యూవీ స్కార్పియో నూతన వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఢిల్లీ షోరూంలో ఈ కారు రూ.9.97 లక్షలకు లభించనున్నది. నూతన ఫీచర్‌తో రూపొందించిన ఈ కారు అధిక శక్తినివ్వనున్నదని, ఆరు గేర్లు ఉన్నాయని కంపెనీ ప్రెసిడెంట్ రాజన్ వధేరా తెలిపారు. ఎంహక్ ఇంజిన్‌తో తయారైన ఈ వాహనం 140 బీహెచ్‌పీ శక్తినివ్వనున్నదన్నారు. రివర్స్ పార్కింగ్ కెమెరా, టచ్ ద్వారా ఇండికేటర్‌ను మార్చుకోవచ్చును, హెడ్‌ల్యాంప్, ఆరు అంగుళాల స్క్రీన్ జీపీఎస్ సిస్టమ్, ఆటోమేటిక్‌గా ఉష్ణోగ్రత నియంత్రించే విధంగా డిజైన్ చేసినట్లు ఆయన చెప్పారు.

316
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS