13 వేలు దాటిన ఎక్స్‌యూవీ 300 బుకింగ్

Fri,March 15, 2019 12:22 AM

M and M gets over 13000 bookings for XUV300

న్యూఢిల్లీ, మార్చి 14: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన కాంప్యాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ300కి వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. గత నెలరోజుల్లోనే 13 వేలకి పైగా బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ వాహనాల్లో కాంపా ్యక్ట్ ఎస్‌యూవీల వాటా 40 శాతానికి పైగా ఉన్నదని, గడిచిన ఐదేండ్లకాలంలో ఈ విభాగం టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నదని తెలిపింది. భారత్‌లో అత్యధిక పోటీ విభాగమైన కాంప్యాక్ట్ ఎస్‌యూవీలో తొలి నెలలోనే 13 వేల బుకింగ్‌లు రావడం విశేషమని మహీంద్రా చీఫ్ సేల్స్ విజయ్ రామ్ నక్రా తెలిపారు. పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్ కలిగిన ఎక్స్‌యూవీ 300 ని రూ.7.90 లక్షల నుంచి రూ.11.99 లక్షల మధ్యలో సంస్థ విక్రయిస్తున్నది. ఎకోస్పోర్ట్, విటారా బ్రెజ్జా, నెక్సాన్‌లకు పోటీగా సంస్థ ఈ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది.

509
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles