ఫార్చూన్ ఇండియాలోఎల్‌పీయూ పూర్వ విద్యారి

Thu,July 11, 2019 01:27 AM

LPU alumni featured in Fortune India 40 under 40'

హైదరాబాద్, జూలై 10: ఫార్చూన్ ఇండియా మ్యాగజైన్ ఈ ఏడాదికిగాను విడుదల చేసిన 40 అండర్ 40 జాబితాలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ) పూర్వ విద్యార్థి రాహుల్ త్యాగీకి చోటు దక్కింది. లుసిడేస్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుల్లో ఒకరే రాహుల్ త్యాగీ.

2012లో ఈ సంస్థను మరికొందరితో కలిసి రాహుల్ స్థాపించారని, తమ విద్యార్థికి ఈ గౌరవం దక్కడంపట్ల ఆనందంగా ఉందని ఎల్‌పీయూ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కేఎఫ్‌సీ, టాటా స్కై, సాఫ్ట్ బ్యాంక్‌లు ఈ సంస్థకు కస్టమర్లుగా ఉండటం గమనార్హం. ఇంటెల్, సోనీ, హెచ్‌పీ, డిస్కవరీ నెట్‌వర్క్స్, టీఈడీ తదితర మీడియా, టెక్నాలజీ సంస్థలకూ లుసిడేస్ సేవలు కొనసాగుతున్నాయి.

329
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles