ఐటీ రిటర్నులకు పాన్‌తో ఆధార్ లింక్ తప్పనిసరి

Thu,February 7, 2019 12:31 AM

Linking of PAN card with Aadhaar mandatory for filing tax return

స్పష్టంచేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఆదాయ పన్ను రిటర్నుల దాఖలకు ఆధార్, పాన్ అనుసంధానం తప్పనిసరేనని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టంచేసింది. ఈ విషయంలో ఇప్పటికే తాము నిర్ణయం తీసుకున్నామని, ఇందులో ఎలాం టి మార్పులు ఉండబోదని, ఆదాయ పన్ను చట్టం 139 ఏఏ ప్రకారం దీనిని అమలు చేయాల్సి ఉంటదని జస్టిస్ ఏకే సిక్కీ, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం స్పష్టంచేసింది. ఆధార్-పాన్ అనుసంధానం లేకుండా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసుకునేందుకు శ్రేయా సేన్, జయశ్రీ అనే మహిళలకు ఢిల్లీ హైకోర్టు గతం లో అనుమతినిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆధార్-పాన్ అనుసంధానంపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉండగా, ఢిల్లీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో ఆ ఇద్దరు మహిళలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను అసెస్‌మెంట్‌ను ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేశారు కూడా. గతేడాది సెప్టెంబర్ 26న ఐటీ రిటర్నులకు ఆధార్-పాన్‌ను లింక్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

1308
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles