మీ డబ్బుకు ఢోకాలేదు..: ఎల్‌ఐసీ

Thu,October 10, 2019 12:58 AM

ముంబై, అక్టోబర్ 9: ఆర్థిక పరిస్థితి దిగజారినట్లు సామాజిక సైట్లలో వస్తున్న మోసపూరిత వార్తలను కొట్టిపారేసింది బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ). పాలసీదారుల డబ్బుకు ఎలాంటి ఢోకా లేదని ఒక ప్రకటనలో వెల్లడించింది. కార్పొరేషన్ భారీ నష్టాల్లో కూరుకుపోయిందని, కోటి మంది పాలసీదారుల డబ్బుపై ఆందోళన వ్యక్తమవుతున్నదని పలు సామాజిక సైట్లలో వార్త హల్‌చల్ చేస్తుండటంపై ఎల్‌ఐసీ ఈ స్పష్టతనిచ్చింది. ఈ తప్పుడు వార్తలతో పాలసీదారులు జాగురుకత వహించాలని, కంపెనీ ఆర్థిక వనరులకు వచ్చిన పెనుముప్పు లేదని పేర్కొంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పాలసీదారులకు రూ.50 వేల కోట్ల బోనస్ చెల్లింపులు జరిపింది తమ సంస్థేనని చెప్పారు. ఆగస్టు 31నాటికి ఎల్‌ఐసీకి 72.84 కోట్ల మంది పాలసీదారులు ఉన్నారు. తొలి ప్రీమియం వసూళ్ళలో మార్చి నాటికి 66.24 శాతంగా ఉండగా, ఆగస్టు నాటికి ఇది 73.06 శాతానికి చేరుకున్నది.

300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles