ఐడీబీఐ బ్యాంక్‌కు రూ.12 వేల కోట్లు!

Sun,February 17, 2019 12:36 AM

LIC may infuse up to Rs 12,000 crore in IDBI Bank

నిధులను కేటాయించనున్న ఎల్‌ఐసీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: నష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వరంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్‌ను ఆదుకోవడానికి బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మరోసారి సిద్ధమైంది. ఇప్పటికే బ్యాంకులో అత్యధిక వాటాను కొనుగోలు చేసిన ఎల్‌ఐసీ.. తాజాగా మరో రూ.12 వేల కోట్ల నిధులను కేటాయించబోతున్నది. మొండి బకాయిల(ఎన్‌పీఏ) ను పూడ్చుకోవడానికి అవసరమైన నిధు ల్లో భాగంగా ఈ కేటాయింపులు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. జనవరి 21, 2019న ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ 51 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 21,624 కోట్ల నిధులను వెచ్చించింది కూడా. గడిచిన త్రైమాసికంలో రూ. 6,190.94 కోట్ల ఆదాయంపై రూ.4,185 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది ఐడీబీఐ బ్యాంక్. అలాగే బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 29.67 శాతానికి చేరుకోగా, నికర నిరర్థక ఆస్తులు మాత్రం 14.01 శాతానికి తగ్గాయి.

704
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles