గ్లోబల్ గోలపట్టని దలాల్ స్ట్రీట్

Wed,July 11, 2018 11:53 PM

last four days the Sensex gained 691.38 points

ముంబై, జూలై 11: టీసీఎస్ భారీగా లాభపడడంతో సెన్సెక్స్ ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి సమీపానికి చేరుకుంది. జనవరి 29న 36,283.25 ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిగా నమోదు అవగా బుధవారంనాడు 36, 265.93 వద్ద క్లోజ్ అయింది. గత నాలుగు రోజుల్లోనే సెన్సెక్స్ 691.38 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ కేవలం 1.05 పాయింట్ల లాభంతో 10,948.30 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ మన మార్కెట్లు లాభాల్లో ముగియడం విశేషం. ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి.

345
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS