ఎల్ అండ్ టీలో 1,500 ఉద్యోగాలు

Mon,April 15, 2019 12:38 AM

Larsen And Toubro to hire 1,500 people this year

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: మౌలిక సదుపాయాల దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టీ) ప్రస్తుత సంవత్సరంలో కూడా 1,500 మంది సిబ్బందిని నియమించుకునే యోచనలో ఉన్నది. మార్చి 31, 2018 నాటికి సంస్థలో ఉద్యోగులు 42,924 మంది ఉండగా, గతేడాది ఇదే సమయానికి ఉన్న 41,466 మందితో పోలిస్తే 1,500 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నట్లు, ఈ ఏడాది కూడా అంతే స్థాయిలో నియమించుకునే అవకాశం ఉన్నదని ఎల్ అండ్ టీ కార్పొరేట్ హెచ్‌ఆర్-సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యోగి శ్రీరామ్ తెలిపారు. కంపెనీలో వలసలు కేవలం ఐదు శాతం మాత్రమేనని, ఇండస్ట్రీలో ఇదే తక్కువదని ఆయన పేర్కొన్నారు. మధ్యస్థాయి ఐటీ సేవల సంస్థయైన మైండ్ ట్రీ కొనుగోలు చేయడంపై పలు అభ్యంతరాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. కంపెనీలో మహిళ ఉద్యోగులకు పెద్దపీట వేస్తున్నట్లు, ముఖ్యంగా ఐటీ, ఆర్థిక సేవలతోపాటు ఇంజినీరింగ్, నిర్మాణ రంగ, రక్షణ విభాగాల్లో అవకాశాలను కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. డిజిటలైజేషన్‌లో భాగంగా ఉద్యోగులను తీసివేస్తున్నారన్న ప్రశ్నపై ఆయన స్పందిస్తూ..అలాంటిదేమి లేదని, కానీ నైపుణ్యం కనబరుచని ఉద్యోగులపై వేటు వేస్తున్నట్లు తెలిపారు. గడిచిన సంవత్సరానికిగాను ఎల్ అండ్ టీకి ఫోర్బ్స్ మ్యాగజైన్ అవార్డు వరించింది.

2925
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles