మార్కెట్లోకి రూ.3 కోట్ల కారు


Fri,January 12, 2018 12:47 AM

విడుదల చేసిన లంబోర్ఘిని
lamborghini
ముంబై, జనవరి 11: ఇటలీకి చెందిన సూపర్ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లంబార్గినీ దేశీయ మార్కెట్లోకి తొలిసారిగా సూపర్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనమైన యూరస్‌ను ప్రవేశపెట్టింది. ఈ కారు ధర అక్షరాల రూ.3 కోట్లు. 4.0 లీటర్ల వీ8 ఇంజిన్‌తో రూపొందించిన ఈ కారు 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.6 సెకండ్లలో అందుకుంటుందని, అలాగే గంటకు 305 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందని లంబార్గినీ జనరల్ మేనేజర్ అంద్రే బాల్డి తెలిపారు. ప్రపంచంలో అత్యధిక వేగంతో దూసుకుపోతున్న కారు ఇదే కావడం విశేషం. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో లగ్జరీ కార్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ ఏడాది అమ్మకాలు మూడు రెట్లు పెరిగే అవకాశం ఉన్నదని ఆయన పేర్కొన్నారు.

414

More News

VIRAL NEWS