కుమార మంగళం వేతనంలో 19 శాతం తగ్గుదల

Mon,July 22, 2019 03:09 AM

Kumar Mangalam Birla remuneration from UltraTech fell 18 8 per cent to Rs 15 53 cr in FY19

న్యూఢిల్లీ, జూలై 21: గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను అల్ట్రాటెక్ చైర్మన్, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమార మంగళం బిర్లా రూ.15.53 కోట్ల వార్షిక వేతనాన్ని అందుకున్నారు. అంతక్రితం ఏడాది పొందిన రూ.19.13 కోట్ల జీతంతో పోలిస్తే 18.8 శాతం తగ్గినట్లు సంస్థ వార్షిక నివేదికలో వెల్లడించింది. దేశంలో అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థయైన అల్ట్రాటెక్ రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నది. గడిచిన రెండేండ్లుగా బిర్లా వేతనంలో తగ్గుదల నమోదైంది. 2016-17లో బిర్లా రూ.22.50 కోట్ల వార్షిక వేతనం అందుకోగా, ఆ మరుసటి ఏడాదిలో ఇది రూ.19.13 కోట్లకు పడిపోయింది. 2018-19లో సంస్థలో సాధారణ ఉద్యోగి పొందిన వేతనంతో పోలిస్తే బిర్లా 202.9 రెట్లు అధికంగా లభించింది.

2016-17లో ఇది 387.9 రెట్లు అధికంగా ఉండగా, 2017-18లో 375.2 రెట్లు అధికం. గతేడాదికిగాను సాధారణ ఉద్యోగి రూ.7.65 లక్షల వార్షిక వేతనాన్ని అందుకున్నట్లు తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 8.5 శాతం అధికం. అల్ట్రాటెక్ మేనేజింగ్ డైరెక్టర్ కేకే మహేశ్వరి జీతం కూడా 4.76 శాతం తగ్గి రూ.12.96 కోట్లకు పడిపోయింది. మార్చి 31, 2019 నాటికి కంపెనీలో 19,557 మంది సిబ్బంది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 21 ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ల ద్వారా సంస్థ ప్రతియేటా 10.28 కోట్ల టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నది. గతేడాదికిగాను సంస్థ రూ.36,775 కోట్ల ఆదాయంపై రూ.2,432 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

271
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles