కొటక్ మహీంద్రా లాభం 2,407 కోట్లు

Wed,October 23, 2019 05:01 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: దేశంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సేవల సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఆర్థిక ఫలితాలు ఆకట్టుకున్నాయి. కోర్ ఆదాయం ఇచ్చిన దన్నుతో గడిచిన త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ. 2,407.25 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. 2018-19 ఏడాది ఇదే త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.1,747.37 కోట్ల లాభాన్ని గడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో రూ.10,829.08 కోట్లుగా నమోదైన బ్యాంక్ ఆదాయం..ఈసారికిగాను రూ.12, 542.99 కోట్లకు ఎగబాకినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. వీటిలో వడ్డీల ద్వారా రూ.8,418.75 కోట్లు లభించింది.


మొండి బకాయిలను తగ్గించుకోవడానికి బ్యాంక్ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గత త్రైమాసికంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.91 శాతం నుంచి 2.17 శాతానికి పెరుగగా, వీటి విలువ రూ.4,302.17 కోట్ల నుంచి రూ.5,475.48 కోట్లకు ఎగబాకింది. నికర ఎన్‌పీఏ 0.82 శాతం(రూ.2,031.59 కోట్లు)గా నమోదయ్యాయి. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి గత త్రైమాసికంలో బ్యాంక్ రూ.473.10 కోట్ల నిధులను వెచ్చించింది. ఏకీకృత విషయానికి వస్తే బ్యాంక్ నికర లాభం 51 శాతం ఎగబాకి రూ.1,724 కోట్లకు చేరాయి. బ్యాంక్ షేరు ధర స్వల్పంగా తగ్గి రూ.1,608గా నమోదైంది.

214
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles