కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీకి జాతీయ స్వచ్ఛత అవార్డు

Thu,December 5, 2019 12:24 AM

హైదరాబాద్, డిసెంబర్ 4: జాతీయ స్థాయి స్వచ్ఛత ర్యాంకింగ్‌లో కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం అగ్ర స్థానాన్ని దక్కించుకున్నది. పరిశుభ్రత, వ్యర్థాల వినియోగంలో అధునాతన పద్ధతుల అమలుతో స్వచ్ఛత అవార్డును సాధించామని బుధవారం యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎల్‌ఎస్‌ఎస్ రెడ్డి విలేకరులకు తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ చేతులమీదుగా కేఎల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కార్యదర్శి కోనేరు శివ కాంచన లత అవార్డును అందుకున్నారని చెప్పారు. క్యాంపస్ ప్రాంగణంలో వ్యర్థాల పునర్వినియోగంతోపాటు విద్యార్థుల వసతి గృహాల్లోని వంటశాలల్లో పాటిస్తున్న పరిశుభ్రత, నీటి స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ చర్యలు తమకు ఈ అవార్డును తెచ్చి పెట్టాయన్నారు.

124
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles