నాలుగు రంగాలదే హవా

Wed,September 11, 2019 02:31 AM

Just 19 Percentage employers in India bullish on hiring in October-December quarter; softer job outlook prevails in several markets Survey

- ఉద్యోగ మార్కెట్‌లో నికరంగా 19 శాతం పెరుగుదల
- వస్తువు ఏదైనా 45 రోజుల్లోపు చెల్లించేలా కేంద్రం నిర్ణయం
- మ్యాన్ పవర్ తాజా సర్వే వెల్లడి


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రస్తుత సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రజాపరిపాలన, విద్య, టోకు, రిటైల్ వాణిజ్యం, సేవల రంగాల్లో ఉద్యోగావకాశాలు జోరందుకోనున్నాయని మ్యాన్‌పవర్ గ్రూప్ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మధ్యస్థ కంపెనీలు, తూర్పు రీజియన్‌లో ఉన్న సంస్థలు బలోపేతం అవుతాయని తెలియజేసింది. గత త్రైమాసికంతో పోల్చితే భారత ఉద్యోగ మార్కెట్‌లో నికరంగా 19 శాతం పెరుగుదల నమోదవుతుందని వెల్లడించింది. నాలుగు రీజియన్లలో నియామకాలు పెరుగుతాయని తెలిపింది. దాదాపు ఏడు రంగాలు బలోపేతం అవుతాయని, వాటిలో ఉత్పత్తి, గనులు, నిర్మాణ రంగాలున్నాయని, వీటి ద్వారా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని వెల్లడించింది.

ఎంఎస్‌ఎంఈలకు ప్రత్యేక ప్రోత్సాహం

బహుళార్థ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పలు చర్యల్ని చేపట్టిందని మ్యాన్ పవర్ సర్వే తెలియజేసింది. దీని ప్రకారం, ఇక నుంచి ఎంఎస్‌ఎంఈ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహించనున్నది. వస్తువు ఏదైనా డెలివరీ చేసిన 45 రోజుల్లోపు చెల్లింపులు జరిపేలా చట్టాన్ని తేవడానికి కేంద్రం సంకల్పించింది. భారత్‌లో సంపదను పెంపొందించే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు విడిగా పలు చర్యల్ని తీసుకుంటున్నది. ఈ క్రమంలో ఎంఎస్‌ఎంఈ రంగంలో నైపుణ్యాల పెంపుదల కోసం బిలియన్ డాలర్ల నిధులను రాష్ట్రాలకు కేటాయించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసింది. 2025 నాటికి భారత ఉన్నత విద్య విభాగం 35.03 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. విద్య రంగంలో వంద శాతం ఎఫ్‌డీఐని అనుమతించిన కేంద్రం, వివిధ కార్పొరేషన్లు.. కలిసికట్టుగా నైపుణ్యాల శిక్షణను పెంపొందించేందుకు ప్రత్యేక చర్యల్ని తీసుకుంటున్నాయి.

354
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles