జీఎమ్మార్ థర్మల్ పవర్‌పై జేఎస్‌డబ్ల్యూ కన్ను

Tue,October 8, 2019 12:28 AM

-ఒడిషా ప్లాంట్ కొనుగోలుకు చర్చలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ఒడిషాలోని జీఎమ్మార్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను దక్కించుకునేందుకు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ గట్టిగా ప్రయత్నిస్తున్నది. జీఎమ్మార్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో చర్చలనూ జరుపుతున్నది. ఈ విషయాన్ని స్టాక్ ఎక్సేంజ్‌లకు ఇరు సంస్థలూ తెలియజేశాయి. ఒడిషాలో జీఎమ్మార్ ఎనర్జీ లిమిటెడ్ అనుబంధ సంస్థ జీఎమ్మార్ కమలంగ ఎనర్జీ లిమిటెడ్ 1,050 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నది. దీన్ని కొనుగోలు చేసేందుకు జీఎమ్మార్ ఎనర్జీ లిమిటెడ్‌తో చర్చలు జరుపుతున్నాం అని జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ బీఎస్‌ఈకి తెలిపింది. అయితే ఈ డీల్ విలువ ఎంతన్నది మాత్రం తెలియరాలేదు. మరోవైపు ఈ నేపథ్యంలో బీఎస్‌ఈలో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ షేర్ విలువ 2.02 శాతం పెరిగితే, జీఎమ్మార్ ఇన్‌ఫ్రా షేర్ విలువ 0.91 శాతం పడిపోయింది.

344
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles