జేఎల్‌ఆర్ దేశవాళి ఎఫ్-పేస్

Wed,November 15, 2017 12:16 AM

JLR launches locally-produced F PACE at Rs 60 02 lakh

ధర రూ.60 లక్షలు
jlr
న్యూఢిల్లీ, నవంబర్ 14: టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్‌ఆర్)..దేశీయంగా తయారైన ఎస్‌యూవీ ఎఫ్-పేస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ధరను రూ.60.02 లక్షలుగా నిర్ణయించింది. 2018 సంవత్సరానికిగాను విడుదల చేసిన ఈ ఎఫ్-పేస్ మోడల్..పుణె ప్లాంట్లో తయారైన ఆరో వాహనమని జేఎల్‌ఆర్ ఎండీ, ప్రెసిడెంట్ రోహిత్ సూరి తెలిపారు. 2 లీటర్ల టర్బో-చార్జింగ్ డీజిల్ ఇంజిన్‌తో ఈ కారును రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా ఈ కారును ఇక్కడే తయారు చేసినట్లు ఆయన చెప్పారు.

147
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS