జియో కూడా..!

Thu,December 5, 2019 12:33 AM

-39 శాతం వరకు చార్జీలు పెంచిన సంస్థ
-శుక్రవారం నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ముకేశ్ అంబానీకి చెంది న రిలయన్స్ జియో కూడా ప్రీపెయిడ్ మొబైల్ కాల్, డాటా చార్జీలను 39 శాతం వరకు పెంచింది. ఈ నెల 6 నుంచి అమలులోకి రానున్న కొత్త చార్జీలు ఇతర టెలికం సంస్థలు వసూలు చేస్తున్నదానికంటే 15 శాతం నుంచి 25 శాతం వరకు తక్కువని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నూతన టారిఫ్‌ల ప్రకారం 84 రోజుల కాలపరిమితి, రోజుకు 1.5 జీబీ డాటా కలిగిన ప్లాన్‌కు రూ.555 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో చెల్లించిన రూ.399తో పోలిస్తే 39 శాతం వరకు అధికం. వీటితోపాటు రూ.153 ప్లాన్‌ను రూ.199కి పెంచిన సంస్థ..రూ.198 ప్లాన్‌ను రూ.249కి, రూ.299ని రూ.349కి, రూ.349ని రూ.399కి, రూ.448ని రూ.599కి, రూ.1,699 ప్లాన్‌ను రూ.2,199కి సవరించింది. అలాగే రూ.98 ప్లాన్‌ను రూ.129కి పెంచింది. ఆల్-ఇన్-వన్ పేరుతో ప్రకటించిన ప్లాన్లలో కనీసంగా రోజుకు 1.5 జీబీల డాటా లభించనున్నది. ఈ నెల 1న మొబైల్ ప్లాన్లను 40 శాతం వరకు పెంచనున్నట్లు జియో ప్రకటించిన విషయం తెలిసిందే. వొడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్‌లు మాత్రం 50 శాతం వరకు చార్జీలను పెంచాయి.

పోటీ సంస్థల కంటే 25 శాతం చౌక

వొడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్ అందిస్తున్న ప్లాన్ల కంటే 25 శాతం వరకు తక్కువకే అందిస్తున్నట్లు జియో ప్రకటించింది. నెల కాలపరిమితి కలిగిన పలు ప్లాన్‌పై జియో రూ.199 నుంచి 349 వసూలు చేస్తుండగా, అదే ఎయిర్‌టెల్ రూ.248 నుంచి రూ.398 వరకు, వొడాఫోన్-ఐడియా రూ.249 నుంచి రూ.399 వరకు విధిస్తున్నది. జియో మాత్రం రూ.399, రూ.444 రెండు నెలల ప్లాన్లను కస్టమర్లకు అందిస్తున్నది. అలాగే మూడు నెలల ప్లాన్లపై జియో రూ.555 నుంచి రూ.599 వరకు, ఎయిర్‌టెల్ రూ.598 నుంచి రూ.698 వరకు, వొడాఫోన్ ఐడియా రూ.599 నుంచి రూ.699 వరకు వసూలు చేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో టెలికం సంస్థలు చార్జీల పెంచడానికి సిద్ధమయ్యాయి.
list

746
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles