జియో x ఎయిర్‌టెల్

Thu,September 12, 2019 03:53 AM

Jio Fiber Effect Airtel Xstream Fibre 1Gbps Broadband Plan Launched at Rs. 3,999 per Month

- ప్రత్యేక బ్రాడ్‌బాండ్ ఆఫర్‌ను ప్రకటించిన సంస్థ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ఇంటర్నెట్ మార్కెట్లో పోటీని మరింత తీవ్రతరం చేస్తూ ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ప్రత్యేక బ్రాడ్‌బాండ్ ఆఫర్‌ను ప్రకటించింది. 1జీబీపీఎస్ వేగంతో అందించనున్న ఈ ఇంటర్నెట్ సేవలకోసం రూ.3,999 చార్జి చేయనున్నట్లు బుధవారం కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ పేరుతో ఆరంభించిన ఈ సేవలు ఢిల్లీ, గుర్గావ్, ఫరీదాబాద్, నోయిడా, ముంబై, పుణె, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, ఇండోర్, జైపూర్, అహ్మదాబాద్‌లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా ఉన్న మిగతా నగరాలకు విస్తరించబోతున్నది. ప్రారంభ ఆఫర్ కింద 1జీబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ డాటా, ల్యాండ్‌లైన్ కాల్స్ ఏ నెట్‌వర్క్‌కైనా చేసుకునే అవకాశం కల్పించింది. వీటితోపాటు మూడు నెలలపాటు నెట్‌ఫ్లిక్స్‌ను ఉచితంతోపాటు ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, జీ5, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌ను అందిస్తున్నది. ఈ నెల 5న ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ..జియో ఫైబర్ బ్రాడ్‌బాండ్ సేవలు ఆరంభించారు. కనీస ఇంటర్నెట్ వేగానికి రూ.699 చొప్పున చార్జి చేస్తున్నది సంస్థ.

576
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles