ఆభరణాల పరిశ్రమకు మాంద్యం ముప్పు?

Tue,September 10, 2019 12:21 AM

Jewellery industry hit by recession job losses likely GJC

- స్వర్ణకారులకు ఉపాధి దూరం కావచ్చన్న సంకేతాలు

కోల్‌కతా, సెప్టెంబర్‌ 9: మాంద్యం ముప్పును ఎదుర్కోనున్న తర్వాతి రంగం.. ఆభరణాల పరిశ్రమేనా?. ఈ ప్రశ్నకు అవును అంటున్నది అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ). మార్కెట్‌లో నెలకొన్న మందగమన పరిస్థితులు.. జ్యుయెల్లరీ ఇండస్ట్రీని కమ్ముకుంటున్నాయని, దీనివల్ల నైపుణ్యం ఉన్న ఎంతోమంది స్వర్ణకారులు ఉపాధిని కోల్పోయే వీలుందని జీజేసీ వైస్‌ చైర్మన్‌ శంకర్‌ సేన్‌ సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. దిగుమతి బంగారంపై కస్టమ్స్‌ సుంకాన్ని, ఆభరణాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను ప్రకటించిన బడ్జెట్‌లో కస్టమ్స్‌ సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు. ఇక మునుపటి విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) విధానంలో 1 శాతంగా ఉన్న పన్ను భారం.. జీఎస్టీ రాకతో 3 శాతానికి చేరింది. ఇదిలావుంటే నగల కొనుగోలుకు పాన్‌ కార్డు తప్పనిసరి అన్న నియమాన్ని రూ.5 లక్షలు, ఆపై నుంచి వర్తింపజేయాలని సేన్‌ సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు.

299
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles