ఆందోళన బాటలో జెట్ ఉద్యోగులు

Sun,April 14, 2019 02:32 AM

Jet Airways employees protest over pay delay in Delhi

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశీయ ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. శనివారం ఇక్కడి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. తమ జీతాల ఆలస్యంపై ఎయిర్‌పోర్టులోని టర్మినల్ 3వద్ద వందలాది జెట్ సిబ్బంది యాజమాన్య తీరును తప్పుబడుతూ నినదించారు. ఒకప్పుడు రోజుకు గరిష్ఠంగా 119 విమాన సర్వీసులను నడిపిన జెట్ ఎయిర్‌వేస్.. శనివారం 6-7 సర్వీసులకు మాత్రమే పరిమితమైంది. రోజురోజుకు సంస్థ పరిస్థితులు, సేవలు అధ్వాన్నంగా తయారవుతుండగా, ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతున్నది. పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్.. సోమవారం వరకు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

680
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles