సోమవారం వరకు సర్వీసులు బంద్

Sat,April 13, 2019 02:25 AM

Jet Airways cancels all international flights till Monday operating single digit planes now

-అంతర్జాతీయ విమానాలను నిలిపివేసిన జెట్
ముంబై, ఏప్రిల్ 12: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్..అంతర్జాతీయ రూట్లలో నడిపే సర్వీసులను వచ్చే సోమవారం వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 25 ఏం డ్లుగా విమానయాన రంగంలో సేవలు అందించిన సంస్థ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి కంపెనీలో వాటాను విక్రయ ప్రతిపాదనకు ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం బిడ్డింగ్‌లను కూడా ఆహ్వానించింది. ఈ బిడ్డింగ్ గడువు కూడా శుక్రవారంతో ముగిసింది. ఇప్ప టి వరకు జెట్ ఎయిర్‌వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్‌తోపాటు యూఏఈకి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్, ఎయిర్ కెనడా, దేశీయ నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు బిడ్లు దాఖలు చేసిన వాటిలో ఉన్నాయి. లీజు బకాయిలు చెల్లించకపోవడంతో గురువారం మరో పది విమాన సర్వీసులను నిలిపివేసిన సంస్థ..ఈశాన్య దేశాలకు నడిపే సర్వీసులను ఈ నెల 15 వరకు నిలిపివేయనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

జెట్‌పై దృష్టి సారించండి: సురేష్ ప్రభు

జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభం అటు విమానయా న రంగ సంస్థలను, ఇటు ప్రభుత్వాన్ని కూడా ఆందోళనకు గురి చేస్తున్నది. జెట్ సంక్షోభంపై ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలను కేంద్ర విమానయాన మంత్రి సురేష్ ప్రభు ఆదేశించారు. భద్రత విషయంలో రాజీ పడకుండా, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కంపెనీకి చెందిన విమానాల రద్దుతో ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయంలో రూ.3,500 కోట్లు గండిపడింది.

అత్యవసరంగా సమావేశమైన పీఎంవో

జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభంపై ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) దృష్టి సారించింది. శుక్రవారం అత్యవసరంగా సమావేశంపై కంపెనీ ఆర్థిక పరిస్థితులపై సమీక్షించింది. ఈ సమావేశానికి పీఎంవో అధికారులతోపాటు పౌర విమానయాన కార్యదర్శి ఖరోలా తదితరులు హాజరయ్యారు. మరోవైపు డీజీసీఏ ఉన్నతాధికారి మాట్లాడుతూ..ప్రస్తుతం జెట్ ఎయిర్‌వేస్ రోజుకు 50 కంటే తక్కువ రూట్లలో విమాన సేవలు అందిస్తున్నదని చెప్పారు. ఇందుకోసం సంస్థ 11 విమానాలను వినియోగిస్తున్నది.

3994
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles