ఎగురలేకపోతున్న జెట్

Fri,April 12, 2019 01:06 AM

Jet Airways cancels all international flights

-అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు
-నిలిచిపోయిన మరో 10 విమానాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: జెట్ ఎయిర్‌వేస్ కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నది. ఇప్పటికే పలు దేశీయ విమాన సర్వీసులను రద్దు చేసుకున్న సంస్థ..తాజాగా అంతర్జాతీయ రూట్లకు నడిపే అన్ని సర్వీసులను గురువారం నుంచి రద్దు చే సుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. విమానయాన రంగంలో ఒకప్పుడు వెలుగు వెలిగిన జెట్ ఎ యిర్‌వేస్ ప్రస్తుతం ప్రమాదం అంచుల్లో కొట్టుమిట్టాడుతున్నది. అంతర్జాతీయ రూట్లతోపాటు ఈశాన్య దేశాలకు నడిపే అన్ని సర్వీసులను కూడా రద్దు చేసుకున్నది సంస్థ. లీజుకు సంబంధించి బకాయిలు చెల్లించకపోవడంతో మరో 10 విమానాలను నేలపట్టునే నిలిచిపోయాయి. తాజాగా తీసుకున్న నిర్ణయంతో శుక్రవారం ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరుల నుంచి ప్యారిస్, ఆమ్‌స్టర్డమ్, లండన్ విమాన సర్వీసులను రద్దు చేసుకున్నది. అలాగే ఈ నెల 13న బెంగళూరు-ఆమ్‌స్టర్డమ్-బెంగళూరుల మధ్య సర్వీసును కూడా నడుపడం లేదని తెలిపింది. కోల్‌కతా, పాట్నా, గువాహటిల నుంచి ఈశాన్య దేశాలకు నడుపుతున్న సర్వీసులను కూడా రద్దయ్యాయని ట్రావెల్ ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ముంబై-కోల్‌కతా, కోల్‌కతా-గువాహ టి, డెహ్రడూన్-గువాహటి ల మధ్య నడిచే సర్వీసులు కూడా రద్దయ్యాయి. గురువారం మధ్యాహ్నానికి కేవలం 14 విమానాలతో సేవలు అందిస్తున్నది. ఒక దశలో 119 విమానాలతో సర్వీసులు అందించిన సంస్థ.. ప్రస్తుతం వీటి లో మూడోవంతు సర్వీసులను కూడా అందించడం లేదు. ప్రస్తుతం జెట్ ఎయిర్‌వేస్‌కు రూ.3,500 కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉన్నది. అంతకుముందు విమానయాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా మాట్లాడుతూ.. జెట్ ఎయిర్‌వేస్ అంతర్జాతీయ రూట్లలో అందించే సర్వీసులపై నివేదిక కోరినట్లు తెలిపారు.

వాటా కొనుగోలు రేసులో గోయల్

జెట్ ఎయిర్‌వేస్‌ను మళ్లీ చేజిక్కించుకోవడానికి నరేష్ గోయల్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కంపెనీలో వాటా విక్రయానికిగాను నిర్వహిస్తున్న బిడ్డింగ్‌లో పాల్గొనడానికి గోయల్ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. బిడ్ల దాఖలుకు చివరి రోజు శుక్రవారం కావడంతో అంతకుముందే ఆయన బిడ్‌ను దాఖలు చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రుణాలను తిరిగి వసూలు చేసుకోవడానికి బ్యాంకుల కన్సార్షియం ఎస్‌బీఐ నేతృత్వంలో ఈ వేలం ప్రక్రియ జరుగుతున్నది. దీంట్లో 31 శాతం నుంచి 75 శాతం వరకు వాటాను విక్రయిస్తున్నారు.

1002
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles