స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం

Tue,February 13, 2018 12:21 AM

January inflation eases to 5.07%, December IIP lower at 7.1%

-జనవరిలో 5.07 శాతంగా నమోదు
-కూరగాయలు, పండ్లు, ఇంధన ధరలు తగ్గుముఖం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: చిల్లర ద్రవ్యోల్బణం గత నెలలో తగ్గింది. కూరగాయలు, పండ్లు, ఇంధనం ధరలు దిగిరావడంతో జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.07 శాతంగా నమోదైంది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ఈ ద్రవ్యోల్బణం గణాంకాలు డిసెంబర్‌లో 17 నెలల గరిష్ఠ స్థాయిలో 5.21 శాతంగా ఉంటే, నిరుడు జనవరిలో 3.17 శాతంగా ఉంది. ఈ మేరకు సోమవారం కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) తెలియజేసింది. డిసెంబర్‌తో పోల్చితే జనవరిలో కన్జ్యూమర్ ఫుడ్స్ ధరలు 4.96 శాతం నుంచి 4.7 శాతానికి, కూరగాయల ధరలు 29.13 శాతం నుంచి 26.97 శాతానికి, పండ్ల ధరలు 6.63 శాతం నుంచి 6.24 శాతానికి తగ్గుముఖం పట్టాయి. ఇంధన ధరలు కూడా 7.90 శాతం నుంచి 7.73 శాతానికి శాంతించాయి. ఎంపిక చేసిన గ్రామాల నుంచి తపాలా శాఖ ద్వారా, ఎంచుకున్న పట్టణాల నుంచి ఎన్‌ఎస్‌ఎస్‌వో ఫీల్డ్ ఆపరేషన్స్ డివిజన్ ద్వారా ధరల వివరాలను సీఎస్‌వో సేకరించింది.

286
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles