ఐటీసీ లాభం రూ.3,482 కోట్లు

Tue,May 14, 2019 12:45 AM

ITC reports net profit of Rs 3,482 crore in Q4

న్యూఢిల్లీ, మే 13: పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న ఐటీసీ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,482 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2017-18 ఏడాది ఇదే కాలానికి నమోదైన రూ. 2,932.71 కోట్ల ఏకీకృత నికర లాభంతో పోలిస్తే 18.72 శాతం వృద్ధి కనబరిచింది. పేపర్‌బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్, హోటల్స్, ఎఫ్‌ఎంసీజీ వ్యాపారాలు భారీ వృద్ధిని నమోదు చేసుకోవడం ఇందుకు కలిసొచ్చిందని పేర్కొంది. అధిక పన్నుల కారణంగా సిగరెట్ వ్యాపారం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నదని తెలిపింది. కోల్‌కతా కేంద్రస్థానంగా పనిచేస్తున్న ఐటీసీ ఆదా యం ఏడాది ప్రాతిపదికన 14.26 శాతం ఎగబాకి రూ.12,946.21 కోట్లకు చేరుకున్నది. గత త్రైమాసికంలో నూనె విత్తనాలు, గోధుమలు, కాఫీ ట్రేడింగ్ అవకాశాలు అధికంగా ఉండటం, పేపర్‌బోర్డ్, హోటళ్ల నుంచి అధిక ఆదాయం సమకూరినట్లు పేర్కొంది. సిగరెట్లను విక్రయించడం ద్వారా వచ్చిన రూ.5,485.92 కోట్ల ఆదాయం కలుపుకొని ఎఫ్‌ఎంసీజీ రంగం నుంచి మొత్తంగా రూ.8,759.84 కోట్లు సమకూరాయి. ఎఫ్‌ఎంసీజీ తర వ్యాపారాలైన హోటళ్లు, వ్యవసాయ, పేపర్‌బోర్డ్, పేపర్, ప్యాకేజింగ్ ద్వారా రూ.4,148.05 కోట్లు లభించాయి. మార్చి 31తో ముగిసిన సంవత్సరానికిగాను సంస్థ రూ.5.75 డివిడెండ్‌ను వాటాదారులకు చెల్లించనున్నట్లు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.52,035.90 కోట్ల ఆదాయంపై రూ.12,824.20 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది.

కంపెనీ చైర్మన్‌గా సంజీవ్ పూరి

ప్రస్తుతం ఐటీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సంజీవ్ పూరికి పదొన్నతి కల్పిస్తూ చైర్మన్‌గా నియమించింది. దీర్ఘకాలికంగా చైర్మన్‌గా వ్యవహరించిన వైసీ దేవేశ్వర్ రెండు రోజుల క్రితం మరణించడంతో ఆయన స్థానంలో పూరి నియమితులయ్యారు. 56 ఏండ్ల వయస్సు కలిగిన పూరి..మే 16, 2018 నుంచి ఎండీగా సేవలు అందిస్తున్నారు. నాలుగేండ్ల క్రితం ఐటీసీ బోర్డులో చేరిన పూరి..ఫిబ్రవరి 5, 2017న సీఈవోగా ప్రమోట్ అయ్యారు. సోమవారం సమావేశమైన కంపెనీ బోర్డు ఈ నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నియామకం వెంటనే అమలులోకి రానున్నట్లు ఒక ప్రకటనలలో వెల్లడించంది.

402
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles