ఐటీలో 8.73 లక్షల ఉద్యోగాలు

Thu,March 21, 2019 01:40 AM

IT sector generated 8.73 lakh jobs in 5 years

-గడిచిన ఐదేండ్లలో కల్పించాం: రవి శంకర్ ప్రసాద్
న్యూఢిల్లీ, మార్చి 20: గడిచిన ఐదేండ్లకాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో 8.73 లక్షల మందికి నూతనంగా ఉద్యోగ అవకాశాలు లభించాయని కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ఉద్యోగ కల్పనలో ఎన్‌డీఏ సర్కార్ విఫలమైందన్న కాంగ్రెస్ విమర్శలను ఆయన తిప్పికొట్టారు. విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని, కావాలంటే గ ణాంకాలు చూసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కాం విడుదల చేసిన డాటా ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 8.73 లక్షల ఉద్యోగాలు సృష్టించ బడ్డాయన్న విషయం అవగతమవు తుంద న్నారు. దీంతో మొత్తంగా 41.40 లక్షల మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగా 1.2 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

ఇది ప్రభుత్వ డాటా కాదని, నాస్కాం రూపొందించిన నివేదిక అని ఆయన స్పష్టంచేశారు. అంతకుముందు పదేండ్లపాటు ఉన్న కాంగ్రెస్ పరిపాలనలో ఎంత మందికి ఉపాధి అవకాశాలు లభించాయో పూర్తి వివరాలు వెల్లడించాలని మంత్రి డిమాండ్ చేశారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ తిరోగమన బాట పట్టిందని, ముఖ్యంగా అవినీతి రాజ్యమేలిందని ఆయన విమర్శలు గుప్పించారు. 2014-15లో ఐటీ, బీపీవో రంగాల్లో 2.18 లక్షల మందికి ఉపాధి లభించగా, ఆ తర్వాతి ఏడాదిలో 2.03 లక్షల మందికి, 2016-17లో 1.75 లక్షల మంది కి, 2017-18లో 1.05 లక్షల మందికి, 2018-19లో 1.72 లక్షల మందికి ఉపాధి లభించినట్లు నాస్కాం వెల్లడించిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. వీటితోపాటు గడిచిన ఐదేండ్లకాలంలో 6.7 లక్షల మందికి ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో ఉద్యోగాలు లభించగా, కామన్ సర్వీసెస్ సెంటర్ల ద్వారా మరో 12 లక్షల మందికి ఉపాధి లభించింది.

1689
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles