ఐటీ చేతికి కెయిర్న్ ఎనర్జీ డివిడెండ్

Mon,April 16, 2018 01:01 AM

IT Dept seizes Rs 440 crore dividend income of Cairn Energy

-మరో రూ.440 కోట్ల ఆదాయం జప్తు
cairn
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: కెయిర్న్ ఎనర్జీకి చెందిన మరో రూ.440 కోట్ల డివిడెండ్ ఆదాయాన్ని ఆదాయం పన్ను (ఐటీ) శాఖ జప్తు చేసింది. రూ.10,247 కోట్ల పన్ను డిమాండ్‌లో భాగంగా బకాయిల వసూళ్ల నిమిత్తం ఐటీ శాఖ ఈ చర్యలకు దిగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.666 కోట్ల డివిడెండ్ ఆదాయాన్ని ఐటీ శాఖ సీజ్ చేసింది. ఈ క్రమంలో మరో రూ.440 కోట్ల డివిడెండ్ ఆదాయాన్ని ఐటీ అధికారులు జప్తు చేయగా, గత నెలలో కెయిర్న్ వాటాదారుల కోసం వేదాంత ఈ డివిడెండ్‌ను ప్రకటించింది. 2011లో కెయిర్న్ ఇండియాను వేదాంత కొనుగోలు చేసిన సంగతి విదితమే. అయినప్పటికీ కెయిర్న్ ఇండియా మాతృ సంస్థ, బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీకి 9.8 శాతం వాటా ఉండగా, గతేడాది వేదాంత లిమిటెడ్‌లో కెయిర్న్ ఇండియా విలీనమైపోవడంతో ఈ వాటా 4.95 శాతానికి పడిపోయింది. ఈ లావాదేవీపైనే ఐటీ శాఖ రూ.10,247 కోట్ల పన్నును డిమాండ్ చేస్తుండగా, ఇందుకు కెయిర్న్ ఎనర్జీ ససేమిరా అనడంతో వేదాంత నుంచి కెయిర్న్ ఎనర్జీకి దక్కాల్సిన ఈ డివిడెండ్ల ఆదాయం కాస్తా ఐటీ శాఖ చేతుల్లోకి వెళ్తున్నది. ప్రస్తుతం ఈ అంశం ఆర్బిట్రేషన్‌లో తుది విచారణ దశలో ఉండగా, ఐటీ శాఖ జప్తుల విలువ రూ.2,700 కోట్లకు చేరింది. ఇందులో డివిడెండ్లతోపాటు రూ.1,59 4 కోట్ల ట్యాక్స్ రిఫండ్ కూడా ఉన్నది.

329
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS