డయాగ్నోస్టిక్స్బలోపేతం

Sun,April 14, 2019 02:07 AM

International level trancisco products in the state

-రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిట్రాన్సిసియా ఉత్పత్తులు
-టీఎస్‌ఎంఎస్‌ఐడీసీతోచర్చల ఫలితం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మెరుగైన డయాగ్నోస్టిక్స్ సేవలు అందించడంలో భాగంగా యూరోపియన్ ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులను తెలంగాణలో ప్రవేశపెట్టినట్లు ట్రాన్సిసియా బయో మెడికల్స్ లిమిటెడ్ సంస్థ వెల్లడించింది. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ)తో ఇటీవలి చర్చల ప్రకారం పూర్తి ఆటోమేటెడ్ హెమటాలజీ అనలైజర్లను రాష్ట్రంలో అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) సురేశ్ వాజీరాణి తెలిపారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించే ఈ ఉత్పాదనలు నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ దవాఖానల్లోని అవసరాలను తీర్చగలవని, త్వరలో వీటిని ప్రభుత్వానికి అందించనున్నామని పేర్కొన్నారు.

705
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles