హైదరాబాద్‌లో ఇంటర్‌కాంటినెంటల్‌ ఎక్సేంజ్‌

Thu,November 14, 2019 12:19 AM

హైదరాబాద్‌, నవంబర్‌ 13: రాష్ట్ర రాజధానిలో మరో అంతర్జాతీయ సంస్థ కార్యకలాపాలు విస్తరించింది. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌కు చెందిన అనుబంధ సంస్థయైన ఇంటర్‌కాంటినెంట్‌ ఎక్సేంజ్‌..హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన తన కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించింది. ఫార్చ్యున్‌ 500 సంస్థల్లో ఒకటైన ఇంటర్‌కాంటినెంటల్‌ ఎక్సేంజ్‌.. భాగ్యనగరంలో శిక్షణ పొందిన డాటా విశ్లేషకులు అత్యధిక మంది లభిస్తున్నారనే ఉద్దేశంతో ఇక్కడే సెంటర్‌ను నెలకొల్పాలని నిర్ణయించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 85 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌లో 750 మంది కూర్చోవడానికి వీ లుంటుందని, వీరిలో ఇప్పటికే 500 మంది సిబ్బందిని రిక్రూట్‌ చేసుకోగా..త్వరో 250 మందిని నియమించుకోనున్నట్లు కంపెనీ ఇండియా హెడ్‌ సచి పాటి తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ భారత్‌కు కేంద్రస్థానంగా పనిచేయనున్నదని, ఇక్కడి నుంచి తన క్లయింట్లకు సేవలు అందించనున్నట్లు చెప్పారు. ఐసీఈ డాటా సేవలపై ప్రత్యేక దృష్టి సారించడంలో భాగంగా టీ-హబ్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.

210
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles