20 లక్షల కోట్లకు బీమా రంగం

Sun,September 9, 2018 11:46 PM

Insurance industry to touch 280 billion by FY20

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: బీమా రంగం శరవేగంగా దూసుకుపోతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి దేశీయ బీమా రంగం 280 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నదని అసోచామ్-ఏపీఏఎస్ సర్వేలో వెల్లడైంది. మన కరెన్సీలో రూ.20 లక్షల కోట్లు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్, బీమాపై ప్రజల్లో అవగాహణ పెరుగుతుండటం ఇందుకు కారణమని విశ్లేషించింది. 2001లో 2.71 శాతంగా ఉన్న బీమా వినిమయం 2017 నాటికి 3.7 శాతానికి చేరుకున్నది. 2011-12లో రూ.3.2 లక్షల కోట్లు(49 బిలియన్ డాలర్లు)గా ఉన్న స్థూల ప్రీమియం వసూళ్లు గతేడాదికిగాను రూ.5 లక్షల కోట్ల(72 బిలియన్ డాలర్లకు)కు చేరుకున్నాయని తెలిపింది. బీమా పరిధిని పెంచడానికి కేంద్రం, రెగ్యులేటర్ చేస్తున్న కృషితో పాలసీలు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగడానికి దోహదం చేస్తున్నదని, ముఖ్యంగా మధ్య, యువతీయువకులు పెరుగుతుండటం, వీరికి బీమా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహణ ఉండటం కూడా ఇందుకు కారణమని సర్వేలో తెలిపింది.

పదికోట్ల మంది నిరుపేదలకు బీమా కవరేజ్ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్‌ను స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీం కింద రూ.5 లక్షల వరకు పాలసీదారుడి కుటుంబానికి ప్రమాద బీమా లభించనున్నది. దీంతో బీమా రంగం రూపు రేఖలు మారడంతోపాటు లక్షలాది మందికి నూతనంగా ఉద్యోగాలు లభించనున్నాయని సర్వే ఆకాంక్షించింది. సామాన్యుడి ఆదాయం పెరుగుతుండటం, మరోవైపు అంతర్జాతీయ సంస్థలు దేశీయ బీమా రంగంలోకి ప్రవేశించడం, సులభతరంగా నియంత్రణ మండళ్లు అనుమతించడం వంటి పరిణామాలు బీమా వినియోగం పెరుగడానికి ప్రధాన కారణం. ప్రైవేట్ బీమా రంగ సంస్థల విషయానికి వస్తే జనరల్ ఇన్సూరెన్స్‌లో 48 శాతం వాటా ఉండగా, జీవిత బీమాలో 29 శాతం కలిగివున్నాయి. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నదని పేర్కొంది. జీవిత బీమా రంగం భారీ వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, వచ్చే ఐదేండ్లకాలంలో ప్రీమియం వసూళ్లలో భారీ పెరుగుదల నమోదు చేసుకునే అవకాశం ఉన్నదని అవుట్‌లుక్‌లో పేర్కొంది. ఆయుష్మాన్ భారత్‌తో హెల్త్‌కేర్, అనుబంధ రంగాలైన ఫార్మాస్యూటికల్స్, డయాగ్నిస్టిక్, మెడికల్ డివైజ్, డాటా మేనేజ్‌మెంట్, బీమా హాస్పిటాల్టీ టీపీఏఎస్, మానవ వనరులు, కమ్యూనికేషన్ టెక్నాలజీ విభాగాలు కూడా మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉన్నదని తెలిపింది.

రెండేండ్లలో తపాలాశాఖ బీమా కంపెనీ

కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి మనోజ్ సిన్హా
insurence-icon
ప్రభుత్వరంగ సంస్థ తపాలాశాఖ బీమా సంస్థను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే పేమెంట్ బ్యాంక్, పార్సిల్ డైరెక్టరేట్ సేవలను ప్రారంభించిన సంస్థ..వచ్చే రెండేండ్లకాలంలో బీమా సేవలు అందించడానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉందని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ప్రస్తుతం తపాలాశాఖ పురోగామి దిశగా పయనిస్తున్నదని, ఇదే క్రమంలో పేమెంట్ బ్యాంక్, పార్సిల్ విభాగంలో తనదైన ముద్ర వేసిందని, వచ్చే రెండేండ్లకాలంలో ప్రత్యేక బీమా సంస్థను ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పీటీఐకి చెప్పారు. ఇందుకు సంబంధించి వచ్చే కొన్ని వారాల్లో ఓ కన్సల్టెంట్‌ను నియమించుకునే అవకాశం ఉందన్నారు. ప్రతి భారతీయుడికి బ్యాంకింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ నెల 1న ప్రధాని నరేంద్ర మోదీ తపాలాశాఖ పేమెంట్ బ్యాంక్(ఐపీపీబీ) సేవలను ప్రారంభించారు.

తపాలాశాఖకు ఉన్న మూడు లక్షల మంది పోస్ట్‌మెన్, గ్రామీణ డక్ సేవక్స్‌ల ద్వారా డిజిటల్ పద్దతిన ఆర్థిక సేవలను అందించనున్నారు. ప్రస్తుతం 650 శాఖలు, 3,250 యాక్సెస్ పాయింట్ల ద్వారా ఈ పేమెంట్ బ్యాంక్ సేవలు అందిస్తున్నది. 1884లోనే తపాలాశాఖ..ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి బీమా సదుపాయాలను అందించిన విషయం తెలిసిందే. ఇందుకోసం పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్(పీఎల్‌ఐ)ని ఏర్పాటు చేసింది కూడా. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి, ముఖ్యంగా బలహీన వర్గాలు, మహిళలకు బీమా కల్పించాలనే ఉద్దేశంతో ఆ తర్వాతి క్రమంలో రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్(ఆర్‌పీఎల్‌ఐ)ని మార్చి 24, 1995న అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్చి 31 నాటికి 46.8 లక్షల పీఎల్‌ఐలు, 146.8 లక్షల ఆర్‌పీఎల్‌ఐలు ఉన్నారు.

2605
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles