పెట్టుబడుల కోసం..

Sun,September 8, 2019 02:57 AM

Infrastructure project for investment

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: పెట్టుబడుల కోసం మౌలిక రంగ ప్రాజెక్టుల అన్వేషణలో పడింది కేంద్ర ప్రభుత్వం. 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు పెంచాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న మోదీ సర్కారు.. రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులను ఇన్‌ఫ్రాలో పెట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల గుర్తింపునకు ఓ టాస్క్ ఫోర్స్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ సీఈవో, వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఇతర సీనియర్ అధికారులతో టాస్క్ ఫోర్స్ ఉంటుందని శనివారం ఆర్థిక శాఖ తెలిపింది.

285
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles