ఇన్ఫీ.. అదరహో

Sat,April 13, 2019 02:40 AM

Infosys clocks net up 10.5 percent to Rs 4,078 cr

-క్యూ4లో 10 శాతం పెరిగిన లాభం..
-రూ.21 వేల కోట్లు దాటిన ఆదాయం
బెంగళూరు, ఏప్రిల్ 12: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు అదరహో అనిపించాయి. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 10.5 శాతం ఎగబాకి రూ.4,078 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. జనవరి-మార్చి మధ్యకాలానికి కంపెనీ రూ.21,539 కోట్ల ఆదాయాన్ని గడించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన రూ.18,083 కోట్లతో పోలిస్తే 19.1 శాతం వృద్ధి కనబరిచింది. తన పోటీ సంస్థయైన టీసీఎస్ కూడా శుక్రవారం ఫలితాలను ప్రకటించింది. ఒకేరోజు ఇరు కంపెనీలు ఫలితాలను విడుదల చేయడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ..మార్కెట్ పరిస్థితులు నిరుత్సాహంగా ఉన్నప్పటికీ గడిచిన సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించామని, గతేడాది 6-8 శాతం వృద్ధిని నమోదు చేసుకున్న సంస్థ..ఈసారికిగాను దీనిని 7.5 శాతం నుంచి 9 శాతానికి పరిమితం చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం కంపెనీ అన్ని విభాగాల్లో మెరుగైన వృద్ధిని సాధించిందని ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు.

గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ప్రయోజనాలు లభిస్తున్నాయని, ఈ ఏడాది తీసుకోనున్న పలు కీలక నిర్ణయాలు భవిష్యత్తు వృద్ధికి దోహదపడనున్నాయన్నారు. గడిచిన త్రైమాసికంలో డిజిటల్ సేవలు అందించడం ద్వారా 1.03 బిలియన్ డాలర్ల(మొత్తం ఆదాయంలో 33.8 శాతం వాటా) ఆదాయం సమకూరింది. గతేడాదితో పోలిస్తే 41.1 శాతం పెరుగుదల కనిపించింది. డాలర్ రూపంలో కంపెనీ నికర లాభం 1.7 శాతం పెరిగి 581 మిలియన్ డాలర్లకు చేరుకోగా, ఆదాయం 9.1 శాతం ఎగబాకి 3.06 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గడిచిన త్రైమాసికంలో సంస్థ 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కంపెనీ సీవోవో ప్రవీణ్ రావు ఈ సందర్భంగా తెలిపారు. అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న డిజిటల్ సేవలు, కోర్ సేవలు ఆటోమేషన్‌తో వినియోగించడంతో ఉద్యోగ కల్పనపై తీవ్రస్థాయిలో ప్రభావం పడుతున్నదన్నారు. మార్చి 31తో ముగిసిన మూడు నెలల్లో నికరంగా 2,622 మంది సిబ్బంది చేరడంతో మొత్తం సంఖ్య 2.28 లక్షలకు చేశారు.

2018-19లో ఎదురుదెబ్బ

నాలుగో త్రైమాసికంలో ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించిన ఇన్ఫోసిస్‌కు పూర్తి ఏడాదికిగాను నిరాశ తప్పలేదు. 2018-19లో కంపెనీ నికర లాభం 3.9 శాతం క్షీణించి రూ.15,410 కోట్లకు పడిపోయింది. ఆదాయంలో మాత్రం 17.2 శాతం పెరిగి రూ.82,675 కోట్లకు చేరుకున్నది. డాలర్ రూపంలో కంపెనీ నికర లాభం 11.5 శాతం క్షీణించి 2.2 బిలియన్ డాలర్లకు పరిమితమవగా, ఆదాయం మాత్రం 7.9 శాతం ఎగబాకి 11.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నది.

గైడెన్స్‌లో నిరాశే..

ఆర్థిక ఫలితాలు దూసుకుపోయినప్పటికీ గైడెన్స్‌లో మాత్రం సంస్థ నిరాశపరిచింది. ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 7.5 శాతం నుంచి 9.5 శాతం మధ్యలో ఉంటుందని గైడెన్స్‌లో పేర్కొంది. అక్టోబర్ త్రైమాసికపు ఫలితాలను విడుదల చేసే సమయంలో ఆ దాయంలో వృద్ధి 8.5 శాతం నుంచి 9 శాతం మధ్యలో ఉంటుందని అంచనావేసింది. కానీ ప్రస్తుత పరిస్థితులు మార్పు లు రావడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడుతుండటం, ఐటీపై పెట్టే ఖర్చును తగ్గించుకోవడానికి కార్పొరేట్ సంస్థలు మొగ్గుచూపడం ఇందుకు కారణమని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 2019-20లో కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్స్ 21-23 శాతం మధ్యలో నమోదవనున్నదని అంచనావేస్తున్నది. గతేడాది 22.8 శాతం పెరిగింది. ఆదా య, లాభాల్లో భారీ వృద్ధిని నమోదు చేసుకున్నప్పటికీ గైడెన్స్ మాత్రం నిరాశపరిచిందని మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు.

రూ.10.50 తుది డివిడెండ్

గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ఇన్ఫోసిస్ రూ.10.50 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఇప్పటికే మధ్యంతర డివిడెండ్ కింద ప్రకటించిన రూ.7ను కలుపుకొని ఈ ఏడాదికిగాను వాటాదారులకు రూ.17.50 పంచనున్నదన్న మాట. జూన్ 25న వాటాదారులకు డివిడెండ్ చెల్లింపులు జరుపనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర స్వల్పంగా పెరిగి రూ.747.85 వద్ద ముగిసింది.

808
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles