గొప్ప ఆర్థిక సంస్కర్త

Sun,August 25, 2019 01:20 AM

Industry tribute to Jaitleys death

-జైట్లీ మృతిపట్ల పరిశ్రమ నివాళి

న్యూఢిల్లీ, ఆగస్టు 24: కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపట్ల దేశీయ వ్యాపార, పారిశ్రామిక వర్గాలు తమ సంతాపాన్ని ప్రకటించాయి. ఆయన ఓ గొప్ప రాజకీయ నేత మాత్రమే కాదని, నిజమైన ఆర్థిక సంస్కర్త కూడా అని కొనియాడాయి. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 66 ఏండ్ల జైట్లీ.. శనివారం ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో కార్పొరేట్ రంగం ఆయన సేవలను స్మరించుకున్నది.

మాటలు రావడం లేదు. మాలాంటి ఎందరికో ఆయన మార్గదర్శి. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాం. ఎవ్వరికైనా ఎలాంటి సాయమైనా చేసేస్తారు
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

ఓ మంచి మనిషి మనందరికీ దూరమయ్యారు. అన్ని రంగాల్లో ఆయనకున్న ప్రతిభ అమోఘం. జైట్లీ మృతి దేశానికి తీర ని లోటు. సంస్కరణల్లో ఆయన ప్రత్యేకం
-శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్

జైట్లీతో పనిచేయడం నా అదృష్టం. ఆయన్నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉన్నది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవారు. ఆర్థికనిర్ణయాల్లో ధైర్యంగా ముందుకెళ్లేవారు
-రాజీవ్ కుమార్, ఆర్థిక కార్యదర్శి

ప్రతీదానిపై జైట్లీకి ఉన్న స్పష్టత అనిర్వచనీయం. ఆయన పనిచేసే విధానం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయనతో కొద్దిరోజులు పనిచేసినా ఎంతో నేర్చుకున్నా
-కేవీ సుబ్రమణియన్, ముఖ్య ఆర్థిక సలహాదారు
NirmalaSitharaman1

జైట్లీని ఓ గొప్ప నేతగా, దార్శనికుడిగా ఈ దేశం గుర్తుంచుకుంటుంది. ఆయన కుటుంబానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక వ్యవహారాల శాఖలు తోడుంటాయి
-అటాను చక్రబర్తి, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి

జైట్లీ ఓ నిజమైన సంస్కరణవాది. ఆయన నిర్ణయాలు దేశ ఆర్థిక ప్రగతికి ఎంతగానో దోహదం చేశాయి. బహుముఖ రంగాల్లో ఆయనకు గొప్ప అనుభవం ఉన్నది
-విక్రమ్ కిర్లోస్కర్, సీఐఐ అధ్యక్షుడు

జైట్లీ మృతి బాధాకరం. గొప్ప కార్యసాధక, ప్రగతిదాయక నేత. కీలక రంగాల సంస్కర్త. వ్యాపార, పారిశ్రామిక రంగాల పక్షపాతి
-బీకే గోయెంకా, అసోచామ్ అధ్యక్షుడు

అరుణ్ జైట్లీ మరణం ఈ దేశానికి తీరని లోటు. గర్వించదగ్గ ఓ ముద్దుబిడ్డను భరతమాత కోల్పోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి జైట్లీ ఎంతో శ్రమించారు
-సందీప్ సోమని, ఫిక్కీ అధ్యక్షుడు

జైట్లీ ఓ అత్యత్తమ ఆర్థిక మంత్రి. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక వ్యవస్థను అందించారు. జీఎస్టీ, దివాలా చట్టం వంటి పలు సంస్కరణలను తీసుకొచ్చారు
-రాజీవ్ తల్వార్, పీహెచ్‌డీసీసీఐ అధ్యక్షుడు

జీఎస్టీ, దివాలా చట్టం వంటి ఎన్నో చారిత్రాత్మక సంస్కరణలకు జీవం పోశారు. జైట్లీ మరణం దేశానికి, ఆర్థిక రంగానికి తీరని లోటు. ఆయన మృతికి నా సంతాపం
-రజ్నీశ్ కుమార్, ఎస్బీఐ చైర్మన్

జైట్లీ ఓ ప్రగతిదాయక నేత. నవ భారత నిర్మాణానికి ఆర్థిక మంత్రిగా తన వంతు కృషి చేశారు. సంస్కరణలకు పెద్దపీట వేసి ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిలందించారు
-గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ చైర్మన్

జఠిలమైన సమస్యలనూ ఇట్టే తీర్చగల నేర్పరి జైట్లీ. న్యాయ శాస్త్రంలో ఆయనకున్న అనుభవం గొప్పది. రాజకీయ, ఆర్థిక రంగాలతోపాటు అన్ని రంగాల్లో ఆయన దిట్ట
-సునీల్ మిట్టల్, భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్

జైట్లీకి నా శాల్యూట్. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన నాయకుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను
-ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ చైర్మన్

ఓ గొప్ప నేతను జాతి కోల్పోయింది. జీఎస్టీసహా ఎన్నో ఆర్థిక సంస్కరణల్లో జైట్లీ భాగస్వాములయ్యారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి
-దీపక్ పరేఖ్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ చైర్మన్

జైట్లీ మరణం.. అటు పార్టీకి, ఇటు దేశానికి తీరని లోటు. రాజకీయ, న్యాయ, ఆర్థిక రంగాల్లో ఆయన సేవలు మరువలేనివి. ఓ గొప్ప మార్గదర్శిని జాతి కోల్పోయింది
-అనిల్ అగర్వాల్, వేదాంత చైర్మన్

ఈ దేశానికి జైట్లీ ఎంతో సేవ చేశారు. ఇంత త్వరగా ఆయన మనకు దూరమవడం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి
-కిరణ్ మజుందార్ షా, బయోకాన్ సీఎండీ

421
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles